Tuesday, April 2, 2024

1.1 ధర్మక్షేత్ర కురుక్షేత్ర మందలి విభాగములు

  



1.1 ధర్మక్షేత్ర కురుక్షేత్ర మందలి విభాగములు

 కర్మలను చేయు శరీర క్షేత్రము మరియు మనస్సు, ప్రకృతి యందలి మూడు సహజమైన ప్రభావపూరిత గుణములు, వాటి యందు వ్యక్తమగు రీతిని అనుసరించి మూడు విభాగములుగా విభజింపబడును. ఆ గుణములు 1. సత్త్వ, 2. రాజస, 3. తామసగుణములు. 

సత్వము అనబడు అనుకూల లక్షణము మనిషి యందు మంచి, సత్యము, స్వచ్చత మరియు ఆధ్యాత్మికతను ప్రభావితము చేయును. తామసమనబడు ప్రతికూల (నెగెటివ్) లక్షణము మనిషియందు చెడును, అసత్యమును, సోమరితనము, అజ్ఞానములను ప్రభావితము చేయును. 

రాజసము అనబడు తటస్థమైన (న్యూట్రల్) లక్షణము క్రియా శీలకమైన గుణము. ఇది సత్వముతో కలిసి, తమస్సును అణచుటకు, లేదా తమస్సుతో కలిసి సత్వమును అణచుటకు సహాయపడుచూ, శరీరమునందు నిత్యమూ క్రియాశీలతనూ, చలనమునూ కలుగజేయును.

 శరీర క్షేత్రమందలి మొదటి భాగము: శరీర ఉపరితల ప్రాంతము 

(First Portion of the Field: The Surface of the Body)

 పైన తెలిపిన 3 శరీర విభాగముల యందు మొదటి భాగము, శరీర ఉపరితలము. ఉపరితలమందలి పంచేంద్రియ అవయవములు (చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు) మరియు కర్మేంద్రియములు (మాటలను కల్పించు నోరు, చేతులు, కాళ్ళు, విసర్జన మరియు జననేంద్రియములు). మానవుని శరీర ఉపరితల భాగమునందు ఇంద్రియ సంబంధ, శరీర కదలికలకు చెందిన కార్యకలాపములు అనగా అనరముల వ్యవస్థచే ప్రేరేపితమైనవి నిత్యమూ జరుగుచుండును. అందుచేతనే శరీర ఉపరితల భాగమును దానికి తగిన విధముగా కురుక్షేత్రమని పిలువబడినది. అనగా బాహ్య ప్రపంచమునకు చెందిన కార్యకలాపములు అన్నియూ నెరవేర్చబడు క్షేత్రము. 

 ఈ శరీర ఉపరితల ప్రదేశము రాజస, తామస గుణములకు నివాస  ప్రదేశము. ప్రధానముగా రాజస గుణమునకు నివాస ప్రదేశము. తమస్సు - భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము యొక్క విశ్వక్రియాశీలక ధాతు తరంగములతో కలసి పనిచేయుట వలన పంచభూతలు అనగా ఘన, ద్రవ, తేజస్సు, వాయు, ఆకాశ సృష్టి పదార్థములుగా కంటికి కనపడు విధముగా ఏర్పడును. ఆ విధముగనే భౌతిక శరీరమునకు చెందిన స్థూలమైన అణుమాత్రపు సృష్టి పదార్థముగా ఏర్పడి, ఆపై మానవ శరీరము ఏర్పడును. తమస్సు యొక్క ప్రతికూల చీకటి తత్వము వలన సృష్టి పదార్థము యొక్క సూక్ష్మమైన మూల సారము (భగవత్తత్వము) స్థూల తత్వపు రూపు వలన మరుగున పడి మానవుని గ్రాహక శక్తియందు అజ్ఞానమును కలుగజేయును. క్రియాశీలక రాజసగుణము యొక్క ప్రాబల్యము  కురుక్షేత్రము (శరీరము) నందు, మనిషి యొక్క చపలత్వముతో కూడిన తత్వము నందు అతను అదుపు చేయదలచు - నిత్యమూ మార్పు చెందు ప్రపంచ తత్వము నందు విస్పష్టమగుచుండును. 

శరీర క్షేత్రమందలి  రెండవ భాగము: ప్రాణశక్తి, చైతన్యము  వసించు మెదడు వెన్నెముక యొక్క చక్ర స్థానములు

 కర్మలను చేయు శరీర క్షేత్రమునందలి రెండవ భాగము 1. ప్రాణశక్తి చైతన్యము వసించు మెదడు, వెన్నెముక మరియు దానికి చెందిన ఆరు సూక్ష్మ చక్ర స్థానాలు (స్థూల శరీర పరంగా మెడుల్లా, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాధిష్ఠాన, మూలాధార చక్రములు)

2. దానికి చెందిన  (మెదడు, వెన్నెముకలకు చెందిన) రెండు అయస్కాంత ధృవములైన మనస్సు, మరియు బుద్ధి.

మనస్సు స్థూల తత్వము వైపు ఆకర్షింపబడుట వలన చక్ర స్థానముల యందలి సూక్ష్మమైన శక్తులు బాహ్యమునకు వెలువడి, గొప్ప వెలుగుతో కూడిన గ్యాస్ లైట్ కాంతి రేఖలవలె విరజిమ్మబడును. ఆ క్రమమున అవి శరీరమందలి ఇంద్రియములకు చెందిన నరముల వ్యవస్థను క్రియాశీలము చేయును. బుద్ధి ఈ సూక్ష్మ శక్తులను లోనికి లాగినపుడు అవి మెదడు స్థానము నందు లోనకు గ్రహింపబడి ఆత్మ చైతన్యము నందు విలీనపరచబడును. అప్పుడు ఈ గ్యాస్ లైట్ బయటి వెలుగు తగ్గినట్లు అగును.  మెదాడూ, వెన్నెముక దండెము, దాని 6 చక్రస్థానములతో కలిపి ధర్మక్షేత్ర కురుక్షేత్రము అనిపిలువబడును. అనగా 1. సూక్ష్మశక్తుల మేధాతీతమైన శక్తుల ధర్మ క్షేత్రము మరియూ స్థూల రూప కార్యాచరణ  (పంచేంద్రియాలతో చేసే పనులు) కురుక్షేత్రము. 

 శరీరమునకు చెందిన ఈ ప్రాంతమునందు ప్రకృతికి చెందిన రాజస, సత్వ గుణములు మిక్కిలి ప్రాబల్యము కలిగి యుండును. రాజస గుణము పంచ భూతముల సూక్ష్మ మూల తరంగములతో కలిసి పని చేయుట వలన 5 కర్మేంద్రియాలకు శక్తి కలిగింపబడుతుంది. అవి పనిచేయు నైపుణ్యము (hands), చలనము (feet), వాక్కు (speech), పునరుత్పత్తి (procreation) మరియు విసర్జన (excretion). రాజసగుణము ఇంకనూ ప్రాణము యొక్క 5 ప్రత్యేక ప్రవాహాలను కల్పించును. 5ప్రత్యేక ప్రాణ ప్రవాహములు శరీరము ముఖ్యమైన పనులు చేయుట యందు తోడ్పడును. 

 "సత్వము" పంచభూతముల సూక్ష్మ తరంగము మూలకములతో కలియుటవలన సున్నితమైన  అవగాహనా శక్తుల అవయవ నిర్మాణము జరుగును. వీటి శక్తి వలన పంచేంద్రియ జ్ఞానము జాగృతమగును. గాఢముగా ధ్యానము చేయు యోగి యొక్క మెదడు, వెన్నెముక చక్రస్థానములందు అతడు అనుభవించు సృష్టి పదార్థము యొక్క నిజమైన సున్నితమైన సూక్ష్మ తత్వము, ప్రశాంతత, ఆత్మనిగ్రహము, ఇతర ఆధ్యాత్మిక శక్తులు (వీటి గురించి తరువాత వివరించబడును) - ఇవన్నియు ధర్మక్షేత్రము - కురుక్షేత్రము అయిన శరీరము పై సత్వగుణ ప్రభావము వలన కలుగును.    

 శరీర క్షేత్రమందలి మూడవ భాగము: దివ్య చైతన్యము యొక్క నిలయము-మెదడు 

శరీర క్షేత్రము యొక్క మూడవభాగము మెదడునందు కలదు. ఇది కనుబొమ్మల నుండి పది వేళ్ళ దూరములో  నడినెత్తి మీది గుండ్రటి వలయాకార స్థలము వరకు, అక్కడి నుండి మెడుల్లా వరకూ వ్యాపించి యుండును (నడినెత్తి మీది గుండ్రటి వలయాకార స్థలము శిశువు తలపై మెత్తటి గుండ్రటి ప్రదేశము - దీనినే "మాడు లేక బ్రహ్మరంధ్రము" అంటారు. శిశువు పెరిగిన కొలదీ ఈ ప్రదేసము గట్టి పడును). ఈ స్థానమును "ధర్మ క్షేత్రము" అంటారు.  

ధర్మక్షేత్రమందలి భాగములు 

1. మెడుల్లా, 

2. మెదడు ముందటి పై భాగము, 

3. ఆధ్యాత్మ నేత్రము యొక్క సూక్ష్మ స్థానము, 

4. వేయిదళ పద్మము - (వీటన్నిటితో పాటు), 

5. వీటన్నిటికీ చెందిన దివ్య చైతన్యము. 

ధర్మ అను పదమునకు సంస్కృత మూలము 'ధృ', అనగా పట్టి ఉంచునది లేక ఆధారముగా వుండునది అని భావము. ధర్మక్షేత్రమునకు ఆ భావము వర్తించునదై వున్నది. శరీరమందలి ధర్మక్షేత్ర ప్రదేశము మనిషి జీవమునకు ముఖ్య కారణము. ఆ విధముగా అది జీవమును మనిషి యందు పట్టివుంచును. ప్రాణశక్తి, చైతన్యము అతి సూక్ష్మ రూపమున ఇచ్చట వ్యక్త పరచబడి అవి మనిషి శరీరమును నిర్మించుటకు, అతనిని పోషించుటకుకారణమై యున్న శక్తులకు మూలమై వున్నది. అట్టి శక్తుల మూలముననే ఆత్మ చివరకు మూడు శరీరములను    ( స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు) వీడి పరమాత్మను చేరును. ఆ విధముగా ప్రకృతి యొక్క స్వచ్ఛమైన కాంతివంతమైన సత్వగుణము ధర్మక్షేత్ర ప్రాంతమున మిక్కిలి ప్రాబల్యము కలిగిన లక్షణము.  ధర్మక్షేత్రము ఆత్మ యొక్క నిలయము. ఆత్మ యొక్క శుద్ధమైన చైతన్యము తానొక ప్రత్యేకమైన ఉనికిని కలిగియుండి, ఈ స్థానము నుండియే స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను నిర్మించునదై మరియూ వాటిని పరిపాలించునదై యుండును. ఆత్మ తనను శరీర బాహ్యమునకు వ్యక్తపరచక (అనగా శరీర స్పృహగా మారకపోతే) తనయందే కేంద్రీకృతమై ఉన్నయెడల అది పరబ్రహ్మముతో ఏకమై యుండును. అట్టి స్థితి యందు అది ప్రకృతియొక్క క్రియాశీలక గుణములచే మరియూ ఇతర కార్యకలాపములచే స్పృశింపబడక, మూడు శరీరముల (స్థూల, సూక్ష్మ, కారణ శరీరముల) పరిమితులకు, వాటి సూక్ష్మమైన కారణములకు అతీతమైన వేయిదళ పద్మము నందు నిత్యనూతన ఆనందపు సింహాసనమున ఆసీనమై యుండును.        

ప్రాణశక్తిని (అనగా జీవమును) సృష్టించి, దానిని పోషించు సూక్ష్మ శక్తులు మరియూ తరంగశక్తులు  (ఓంకారము నుండి ఏర్పడే తరంగశక్తులు) ధర్మక్షేత్ర ప్రాంతమందలి మెదడునందు వేయిదళపద్మము మరియూ ఆధ్యాత్మిక నేత్రము యొక్క సూర్యుని నుండి ప్రవహించి మెదడూ, వెన్నెముకయందలి సూక్ష్మమైన, స్థూలమైన స్థావరముల యందు వ్యాపించి శరీరమును, దాని జ్ఞాన అవగాహనను, ఇతర కార్యకలాపములను సజీవము గావించును. మెదడూ, వెన్నెముక సూక్ష్మమైన, స్థూలమైన శక్తులను ప్రవహింపజేయునవియే గాక, అవి చైతన్య స్థావరములు అనికూడా పిలువబడును.  

 ధర్మక్షేత్రము నుండి 'ఆత్మ చైతన్యము ' ప్రాణశక్తి యొక్క అధోగమనమును అనుసరించును. *ఆత్మ యందలి ప్రకాశము (Sun of the Soul) తన చైతన్యమును విద్యుత్కాంతి రేఖలవలె ఆధ్యాత్మిక నేత్రము ద్వారా వెన్నెముక యందలి ఆరు చక్ర స్థావరములకు పంపించును. ఆత్మ యొక్క దివ్య చైతన్యము వెన్నెముక చక్ర స్థావరముల (షట్చక్రాలు) యందలి ప్రభావ పూరిత శక్తికి తానే మూలముగా తనను వ్యక్తపరచు చుండును. ఆత్మ చైతన్యము సూక్ష్మ శరీర చక్ర స్థావరముల నుండి తదుపరి, తనకు సన్నిహితము అయిన అవచేతనా స్థితిని (సూపర్ కాన్షస్నెస్) చేరి, అపై శరీర స్పృహను చేరి, అటునుండి స్థూల శరీరపు వెన్నెముకను చేరును. వెన్నెముకను చేరిన ఆత్మ చైతన్యము వెన్నెముక యందలి నాడీ వలయ కేంద్రముల ద్వారా నాడీ వ్యవస్థను చేరి, వాటి ద్వారా శరీర ఉపరితలమును చేరును. ఈ విధముగా మనిషి స్పృహను కలిగి యున్నపుడు అతని బాహ్య శరీరము ఇంద్రియముల నుండి అందించబడు ప్రేరణలకు స్పందించు చుండును. ఆ స్పందనకు కారణమైన ఆత్మ చైతన్యము ఆ స్థితి యందు తనను శరీరపు 'అహము ' గా వ్యక్తము చేయును. 

సన్ ఆఫ్ ది సోల్: సూర్యకాంతి వంటి ఆత్మ యందలి ప్రకాశము 

 

Monday, April 1, 2024

Soul Vs Ego యుద్ధం పుట్టుపూర్వోత్తరాలు


భగవంతుడిని పోలిన ఆత్మ (Soul) Vs శరీరమును పోలిన అహము (Ego) 

(భగవదంశ అయిన ఆత్మ Vs శరీరాంశమైన ఆత్మ)  


 ఒక సరళమైన విధానమున చెప్పవలెనన్న రాజైన ఆత్మ రాచభవనమునందు వసించు అంతరంగ ప్రదేశములు:-

1. అధిచేతన స్థితి యొక్క సూక్ష్మ స్థావరము (Superconsciousness)

2. కూటస్థ చైతన్యము (Christ Consciousness)

3. విశ్వచైతన్యము (Cosmic Consciousness)

 ఈ స్థావరములు వరుసగా 1. మెడుల్లా, 2. మెదడు ముందుభాగము- రెండు కనుబొమల నడుమ స్థానము (అదియే ఆధ్యాత్మ నేత్ర స్థానము), 3. మెదడు పైభాగము/నడినెత్తిన (ఆత్మ సిమ్హాసనము). అది వేయిదళ పద్మము యందలి స్థానము. ఈ స్థానములకు చెందిన స్థితి నుండి చైతన్యము ప్రవహించి, "ఆత్మ" రాజుగా ఉన్నతమైన పరిపాలనను సాగించును. అనగా మనిషి యందు ఆత్మ భగవంతుని ప్రతిబింబమై యుండును. కానీ ఆత్మ శరీర చైతన్యమునకు దిగి వచ్చినచో అది "మాయ, మరియు అజ్ఞానము" యొక్క ప్రభావమునకు గురగును. అనగా వ్యక్తి భ్రాంతికి, అజ్ఞానమునకు గురగును. ఫలితముగా అహము చైతన్యము (Ego) ఏర్పడును. 

" ఆత్మ" విశ్వమాయకు గురై భ్రాంతికి లోబడినపుడు అది పరిమితమైన "అహము" (Ego) గా మారును. అపుడది శరీరము తోను, శరీరమునకు చెందిన ఇతర విషయములతోను (ఇంద్రియాలతో) తనను పోల్చుకొనును. అహము (Ego) రూపమున ఉన్న ఆత్మ శరీరమునకు ఉన్న పరిమితులు అన్నిటిని తనకు ఆపాదించుకొనును. ఆ విధముగా శరీరముతో తనను పోల్చుకొనెడి ఆత్మ, తన సర్వవ్యాపక తత్వమును, సర్వజ్ఞతను, సర్వశక్తివంత తత్వమును వ్యక్తపరచ జాలదు. ధనికుడైన రాజకుమారుడు మతి మరపును పొంది తానొక బికారినని భావించి, మురికి వాడల యందు సంచరించు విధముగా ఆత్మ తాను పరిమితమైన దానిని అని భావించును. ఇటువంటి భ్రాంతిమయ స్థితి యందు, అహము (Ego) అను రాజు శరీర సామ్రాజ్యమును ఆక్రమించును. 

 భ్రాంతికి గురైన "అహము చైతన్యము" "నేను శరీరమును, ఇది నా కుటుంబము, ఇది నా పేరు, ఇవన్నీ నా సంపదలు" అని పలుకును. అహము తాను శరీర సామ్రాజ్యమును పరిపాలిచు చున్నాను అని  భావించిననూ, నిజమునకు అది శరీరము, మనస్సునకు చెందిన ఒక ఖైదీ. మరియూ మనస్సు, శరీరమూ రెండునూ సూక్ష్మమైన విశ్వప్రకృతికి  చెందిన మాయోపాయము నందలి "పావులు" మాత్రమే.

 సృష్టి యందలి బ్రహ్మాండ జగత్తు నందు దివ్య పరబ్రహ్మకు, మరియూ ప్రకృతొ యొక్క అసంపూర్ణ వ్యక్త రూపమునకు మధ్యన నిరంతరం ఒక నిశ్శబ్ద పోరాటమునకు మనమే సాక్షులము.  దివ్య పరబ్రహ్మ యొక్క నిష్కళంక తత్వము నిరంతమూ మోసపుచ్చు గుణమున్న, దయ్యపు స్వరూపమైన విశ్వవ్యాపిత భ్రాంతి శక్తి కల్పించు అసహ్యకరమైన వికృత స్వరూపములతో నిత్యమూ పోరాడుచుండును. ఒక శక్తి ఎరుకతో సర్వమూ శుభకరమైన "మంచి"ని వ్యక్త పరచుచుండును. మరొక శక్తి రహస్యముగ పనిచేయుచూ "చెడు"ను కల్పించుచుండును. 

బ్రహ్మాండ జగత్తున జరుగుచున్నదే సూక్ష్మ జగత్తున కూడా జరుగుచుండును. జ్ఞానమునకు మరియు అవిద్య/అజ్ఞానముగా రూపొందుచున్న ఒక నిశ్చితమైన భ్రాంతికర శక్తికి - మధ్యన జరుగు యుద్ధమునకు మానవ శరీరము మరియు మనస్సూ ఒక యథార్థమైన యుద్ధభూమి. "ఆత్మ" రాజు యొక్క సామ్రాజ్యమును తన యందు నెలకొల్పదలిచిన ప్రతి ఆధ్యాత్మిక అభిలాషీ "అహము" (Ego) అను రాజును, తిరుగుబాటుదారులను (మనస్సులోని చెడు శక్తులు), అహము యొక్క శక్తివంతులైన సహచరులను ఓడింపవలెను. ధర్మక్షేత్ర, కురుక్షేత్రమందు జరుగు యుద్ధమిదియే.


00000000

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...