THE THREE BATTLES: MORAL, PSYCHOLOGICAL & SPIRITUAL
భగవద్గీత యందు తెలుపబడిన కురుక్షేత్ర యుద్ధము శరీర క్షేత్రమందలి మూడు భాగముల యందలి యుద్ధమును గెలుచుటకు చేయవలసిన ప్రయత్నములను వివరించు చున్నది.
అవి నైతిక, మానసిక, ఆధ్యాత్మిక యుద్ధములు
1 ప్రాపంచికమైన/నైతిక యుద్ధము: మంచికీ చెడుకూ, సత్కర్మకూ దుష్కర్మకూ మధ్యన జరుగు కురుక్షేత్రమందలి మన శరీరమందలి శరీర ఇంద్రియ ప్రాంతమున జరుగు యుద్ధమే ప్రాపంచిక, నైతిక యుద్ధము.
2. మానసిక యుద్ధము: ధర్మక్షేత్ర, కురుక్షేత్రమందలి మెదడూ, వెన్నెముక ప్రాంతమున యోగా, ధ్యానము చేయు సమయమున మానసిక యుద్ధము జరుగును. ప్రాణశక్తి, చైతన్యమును మానసిక ప్రవృత్తులు, ఇష్టాయిష్టములు, బాహ్యమునకు సృష్టి విషయముల వైపు లాగగా బుద్ధి యొక్క శుద్ధమైన విచక్షణా శక్తులు ప్రాణశక్తి చైతన్యమును అంతరంగ ఆత్మవైపు లాగునపుడు ఈ మానసిక యుద్ధము జరుగును.
3. ఆధ్యాత్మిక యుద్ధము: ధర్మక్షేత్రమందలి మెదడు స్థానౌన లోతైన ధ్యాన సమయమున ఆధ్యాత్మిక యుద్ధము జరుగును. అధమ స్థాయికి చెందిన శరీర స్పృహను సమాధియందు కరిగించి విశ్వచైతన్యము నందు ఆత్మ పరమాత్మతో జయప్రదముగా లయమగుటయే ఆధ్యాత్మిక యుద్ధము.
పరిణతి చెందిన యోగి దివ్యానందకరమైన సమాధి స్థితిని సాధించి దానియందు దివ్యానందమును అనేకమార్లు అనుభవింపవచ్చును. కానీ అతను అటువంటి దివ్యానంద స్థితి యందు లయమై యుండుటను నిరంతరము ఎడతెగక కొన్సాగింప లేక పోతాడు. అతను అతని గతకర్మల ప్రభావము వలన మరియూ అతనియందు కోరికలూ బంధములూ మిగిలియుండుట వలన అతడు 'అహంభావమునూ, శరీర స్పృహనూ ' మరలా పొందును. అయిననూ యోగి 'పరమాత్మతో' జయప్రదముగా లయమగు ప్రతీ అనుభవము వలన అతని ఆత్మచైతన్యము మరింత బలపడి, అది శరీర సామ్రాజ్యముపై ధృఢమైన అదుపును సంపాదింపగలుగును. చివరకు అతని కర్మ ఫలము నిశ్శేషమగును. అధమస్థాయికి చెందిన అతని కోరికలు, బంధములూ అణచివేయబడును. అతని అహము నిర్జింపబడును. యోగి 'కైవల్యము ' అనబడు ముక్తి ని పొందును. అదియే భగవంతుని యందు శాశ్వతమైన ఐక్యత.
విముక్తిని పొందిన యోగి తన మూడు శరీరపు పొరలనూ విసర్జించి, శాశ్వతమైన నిత్య జాగరూకమైన, నిత్య నూతన ఆనందమైన సర్వ వ్యాపక పరబ్రహ్మ యందు స్వేచ్ఛగా వుండవచ్చును. లేక అతడు కోరుకొన్నచో అతను సమాధి స్థితిని వీడి శరీర స్పృహను పొంది శారీరిక కార్యకలాపములను చేయవచ్చును. అట్టి కార్య కలాపములను అతను "నిర్వికల్ప సమాధి స్థితి" యందు నిర్వహించును. అటువంటి ఉన్నత స్థితి యందు యోగి ఆత్మ చైతన్యమును బాహ్యమునకు వెలిబుచ్చును. అటువంటి స్థితి యందు యోగి దివ్య పరమాత్మ విశ్వ ప్రణాళిక యందు తన వంతు బాధ్యతలను బాహ్య ప్రపంచమున నిర్వహించుతూ, ఏ విధమైన కల్మషములను పొందక, తాను ఎటువంటి మార్పునూ చెందక భగవదవగాహనను వీడక, సుద్ధ ఆత్మ తత్వము నందే అతడు కొనసాగును. ఇటువంటి దివ్యమైన స్థితి యందు రాజైన 'ఆత్మా శరీర సామ్రాజ్యం పై నిర్వివాదమైన అదుపును కలిగియుండును.
*****************
No comments:
Post a Comment