Saturday, May 18, 2024

1.1 The Bodily Kingdom Under the Reign of Ego



  రాజైన "అహము " యొక్క పరిపాలన యందు శరీర సామ్రాజ్యము:

20 వ పేజీ యందలి చిత్రము "అహము " రాజై పరిపాలించునపుడు మనిషి యొక్క తత్వము వుండు విధమును విశరదపరుస్తోంది.  "అహము " అనేది విశ్వమాయశక్తి యొక్క ఉపకరణము.  "అహము " మనిషి యందు తాను 'భగవంతుని కంటెను వేరైన వాడనూ అను నమ్మకమును కలుగజేయును. 

ప్రస్తుత చిత్రము మునుపటి చిత్రము కన్నను ఎన్నో విధాలుగా వేరుగా వుంది. రాజైన అహము/ఈగో మరియూ అతని తిరుగుబాటుదారులు శరీర సామ్రాజ్యాన్ని ఆక్రమించినపుడు శరీరము నందు కలిగిన మార్పులను ప్రస్తుత చిత్రము విపులీకరిస్తోంది. అహమును  "మిథ్యా ఆత్మ " అని పిలుస్తారు. ఏలయనగా అహము ఆత్మను అనుకరించి, శరీర సామ్రాజ్యము అంతటినీ శాసించుటకు ప్రయత్నించును. కానీ ఈ దురాక్రమణదారుడు 

1. అధిచేతన స్థితి యొక్క భవంతి యందలి అంతరంగ ప్రదేశముల యందు

2. క్రీస్తు చైతన్యము, విశ్వచైతన్యము యొక్క అంతరంగ ప్రదేశాల యందు ప్రవేశము పొందజాలదు. 

అహము మనిషి యొక్క చేతనా స్థితిని, అవచేతనా స్థితిని  మాత్రమే పరిపాలించ గలదు. మెడుల్లా చక్ర స్థావరము నందు ఆత్మ యొక్క అధిచేతనా స్థితి అంతర్ముఖమై యుండును. మానవ చైతన్యము మెదడు, వెన్నెఉకల యందు బాహ్యమై ప్రవహిస్తూ తనను పరమాత్మతో గాక శరీరముతో పోల్చుకుని,  'అహమూ రూపాన రాజుగా ఒక స్థిరత్వము లేని పరిపాలనను ప్రారంభించును. 


'అహం రాజు' అధీనమందలి మెదడు యొక్క అవచేతనాస్థితి (సబ్ కాన్షస్  మైండ్), మరియు మెదడు యందలి చైతన్యపు దిగువ ప్రాంతము (శరీర చైతన్యము) ప్రశాంతమైన, సర్వజ్ఞత కలిగిన, సర్వశక్తివంతమైన ఆత్మచే పరిపాలింప బడక ఆ ప్రాంతము -  నిత్య చంచలత్వము కలిగిన, గర్వంతో కూడిన, అజ్ఞానపు, శరీరమునకే పరిమితమైన , దుర్భలమైన, తిరుగుబాటు దారు అయినా అహమునకు నిలయమగును. బుద్ధికి బదులు అజ్ఞానము అను ప్రధాని అధికారమును చలాయించును.


"తిరుగుబాటుదారు "అహం" రాజుచే పరిపాలింపబడు శరీర సామ్రాజ్యము" :-


1. నియంతృత్వపు తిరుగుబాటు అహం రాజు యొక్క భవనము :-మెడుల్లా యందలి బాహ్యమునకు ప్రవహించు చైతన్య స్థావరము, మెదడు వెన్నెముక  యందలి నాడీ జాలము నందలి చేతన, అవచేతన స్థితి మరియు శరీరంతో పోల్చుకొను స్థావరములు.

2. మంత్రివర్గము:-

అజ్ఞానము అనబడు ప్రధాని అధీన మందలి కోరికలు, భావోద్వేగము, అలవాట్లు, క్రమశిక్షణ లేని ఇంద్రియ చపలత్వమము. పెద్దల సభ యొక్క తలుపులు ఏడూ మూయబడి అందలి మెడుల్లా విశుద్ధ అనాహతకు చెందిన దివ్యమైన విచక్షణా శక్తులు ,శక్తి విహీనము గావించబడును. దిగువ సభకు చెందిన మణిపుర, స్వాధిష్ఠానా, మూలా ధార చక్రముల ద్వారా అజ్ఞానము అనుబడు ప్రధానిచే ప్రభావితము కాబడి, ఆ శక్తులు అహం రాజు యొక్క ఇంద్రియ ప్రవృత్తులను  బలపరచుటకు ఉపయోగించబడును.

3.శరీర సామ్రాజ్యపు అవయవములు:-

మూలాధారపు స్థావరము ప్రకృతికి చెందిన చంచలత్వపు, ఇంద్రియ బానిసత్వపు శక్తిని కలిగి శరీరమందలి ఇతర అవయవములను అనగా ఎముకలను, మజ్జను, అంగములను, నరములను, రక్తమును, రక్తనాళములను, గ్రంధులను, కండరములను, చర్మమును కలిగి ఉండును.


4. పది ఇంద్రియ యువరాజుల ప్రాంతములు.

A. వినికిడి ప్రాంతము-పొగడ్తను  యువరాజుచే పాలింపబడును.

B. దృష్టిప్రాంతము (ఆప్టికల్ ఎస్టేట్):నీచ  దృష్టి యువరాజు చే పాలించబడును.

C.నాసికప్రదేశము-క్షుద్రమైన వాసనల యువరాజుచే పాలించబడును.

D. రుచి ప్రదేశము - అత్యాశ గల యువరాజుచే పాలింపబడును.

E.కంఠ/ స్వర ప్రదేశము -కఠినమైన నిజాయితీ లేని వాక్కు గల యువరాజు.

F.స్పర్శ ప్రదేశము - విషయాసక్తి స్పర్శ యువరాజు.

G.నైపుణ్య ప్రదేశము -వినాశకర పట్టు-పిడికిలి కలిగిన యువరాజు.

H.చలనప్రదేశము- దుర్మార్గపు నడత కలిగిన యువరాజు.

I.సంతానోత్పత్తి ప్రదేశము - విశృంఖల తత్వపు యువరాజు.

J. విసర్జనప్రదేశము - విషపూరిత యువరాజు.


5. శరీర సామ్రాజ్యము నందు బంధింపబడిన ప్రజలు: ఆలోచనలు, సంకల్పము, అనుభూతి, కణములు, అణువులు, పరమాణువులు, ఎలక్ట్రానులు,

6. జీవనపు మెరుపు(లైఫ్ స్పార్క్)- అహము రాజును, అతని అనుచరులను తృప్తి పరచుటకు, అసహజమైన, సామరస్యతలేని పరిస్థితులయందు పనిచేయను. దాని ఫలితముగా క్రోధము, అనారోగ్యము, అసమర్థత సంభవించును

      'అహం రాజు' నిరంకుశుడు. శరీర సామ్రాజ్యమును 'ఆత్మ రాజు ' నుండి దూరముగా ఉంచుటకు అతను తనను అనుసరించు , తన చెప్పుచేతల యందు ఉండు సలహాదారులను మాత్రమే కలిగి ఉండును. అహము యొక్క మంత్రులు : భౌతికపరమైన కోరికలు, భావోద్వేగములు, అలవాట్లు, మరియు క్రమశిక్షణ లేని ఇంద్రియ చపలత్వము. వీరందరూ అజ్ఞానము అను ప్రధానికి లోబడి ఉందురు. ఈ చొరబాటు దారులు పెద్దల సభ యొక్క తలుపులను మూసివేసి అందలి ఎగువ సభ అనబడు మెడుల్లా, విశుద్ధ అనాహత చక్ర స్థావరముల కు చెందిన బుద్ధి, విచక్షణ శక్తులను, శక్తి విహీనము గావింతురు. దిగువ సభకు చెందిన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర చక్ర స్థావరముల యందలి సామాన్య ఇంద్రియ శక్తులు అదివరకు రాజైన ఆత్మకు, అతని ప్రధాని బుద్ధికి విధేయులై ఉండిన వారు ఇప్పుడు 'అజ్ఞానము అనబడు ప్రధాని ' యొక్క ప్రభావము చే అహం రాజు యొక్క నీచమైన ఇంద్రియ చపలత్వమును బలపరిచెదరు. అనగా పరమాత్మ వైపు  ఆకర్షితమగు, మరియు సత్యమును తెలియజేయు బుద్ధి , అహము మరియు దానితో కూడిన మాయ - అవిద్యచే అణచి వేయబడినప్పుడు, ఇంద్రియ చైతన్యము కలిగిన మనసు యొక్క ప్రాబల్యము పెరుగును. మనసు పరమాత్మ నుండి వికర్షిత మగుశక్తి, కనుక అది సత్యమును మరుగుపరిచి మనిషి యందలి చైతన్యమును సృష్టి పదార్థముతో ముడి వేయను. 

      'అహం రాజు' యొక్క అధీన మందలి శరీర సామ్రాజ్యపుభాగములు (శరీర భాగములు) వడలి బీడు బారి శరీర సామ్రాజ్యమంతట అకాల వృద్ధాప్యము ఆవహింపబడును. మరియు అంటువ్యాధుల ప్రభావము చే శరీరము రోగగ్రస్తమై ఉండును. ప్రధాన శరీర భాగమైన మూలాధార చక్ర స్థావరము  నందలి సృష్టికారక ప్రకృతి మాత నిరంతరము ఆందోళనతో కూడి ఉండును. ఆమె యొక్క నిర్మాణాత్మక ప్రాణశక్తి దుర్వినియోగ పరచబడి అదుపు లేని ఇంద్రియముల కోరికల కారణంగా అది వ్యర్థము గావింపబడును.

 

ఇంద్రియ యువరాజులు తమను శరీరముతో పోల్చుకొనిన వారై సుఖానుభూతిని కోరి భోగలాలసత కలవారై, అహంభావితులై వుందురు. వీరు అజ్ఞానముచే ప్రభావితులై, చెడు (అహంభావపూరితులై) మార్గమున నడచుచు తమకు హాని కలిగించు అలవాట్లనే కలిగియుందురు. 

ఆలోచనలు, సంకల్పము, అనుభూతులు అనబడు ప్రజలు ప్రతికూల స్వభావమును కలిగియుండి, సంకుచిత స్వభావమును కలిగియుండి అలసి సొలసి దుఃఖముతో ఉందురు. ప్రజ్ఞతో కూడిన పనిమంతులైన కణములు, అణువులు, ప్రాణశక్తి యొక్క పరమాణు సమూహము ఛిన్నాభిన్నమై, అసమర్థులై నీరసించు యుందురు. 'అహమూ పరిపాలన యందు 'అజ్ఞానమూ అనబడు ప్రధాని నాయకత్వమున మనిషి దేహ సామ్రాజ్యమందలి మానసిక, అణుసమూహము యొక్క శ్రేయస్సుకు చెందిన చట్టములన్నియు అతిక్రమింపబడును. అహము పరిపాలన యందు స్వల్పకాలిక ఆనందమును సైతము పరిహరించు దుఃఖముతో కూడిన, అనిశ్చితితో కూడిన, అనేక భయములతో కూడిన చీకటి రాజ్యమేలుచుండును. 


**************


No comments:

Post a Comment

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...