మానవ సౌభ్రాతృత్వ మధుర గీతిక
ఓ దివ్య చైతన్యమా! నీ కాంతి ధామాన్ని చేరుకోవడానికి అనేక దారుల గుండా ప్రయాణిస్తున్నాము. అన్ని మతముల నమ్మకాలు ఆఖరుగా చేరుకునే ఆత్మ సాక్షాత్కారమనే రాచబాట అందుకునే విధంగా మాకు మార్గ నిర్దేశనం చెయ్యి.
అనేకంగా చీలిన మతాలన్నీ సత్యమనే మహా వృక్షానికి చెందిన చీలిపోయిన కొమ్మలే. అన్ని దేశ కాలాలకు చెందిన గ్రంధాలనే వనాలలో వ్రేలాడుతున్న్న ఆత్మసాక్షాత్కారమనే మధురఫలములను చవిచూసెదము గాక. అత్యున్నత స్థాయి ఆరాధనను ప్రకటించే లెక్కలేనన్ని వ్యక్తీకరణలను ఏక కంఠముతో జపించుట మాకు నేర్పించు.
ఓ జగన్మాతా! విశ్వప్రేమ అనెడి నీ ఒడిలోనికి తీసుకొని మమ్ము లాలించు. నీ మౌన వ్రతాన్ని విడనాడి మాకోసం విశ్వ మానవ సౌభ్రాతృత్వమనే మధుర గీతికని ఆలపించు.
పరమహంస యోగానంద
No comments:
Post a Comment