నీ హృదయంలో నాకు అత్యంత వినయపూర్వకమైన స్థానం ఇవ్వుము
ఓ సర్వ సృష్టికర్త!
నీ కలల తోటలో నన్ను ప్రకాశవంతమైన పువ్వుగా ఉండనివ్వు. లేదా నీ స్వర్గపు విశాలమైన హారంలో నీ ప్రేమ యనెడి కాలాతీతమైన దారపు పోగులో మెరిసే పూస వలె నేనొక చిన్ని నక్షత్రం అవుతాను.
లేదా నాకు అత్యున్నత గౌరవం ఇవ్వు: నీ హృదయంలో అత్యంత నిరాడంబరమైన ప్రదేశం.అక్కడ నేను జీవితం యొక్క గొప్ప దర్శనాల సృష్టిని చూస్తాను.
ఓ కలల కలనేతల ప్రభువా, శాశ్వత వేకువ అనెడి నీ ఆలయాన్ని చేరేందుకు నీ ప్రేమికులందరూ నడిచి వెళ్ళేందుకు ఆత్మ సాక్షాత్కారమనెడి అతి మెత్తని తివాచీని నేయడం నాకు నేర్పుము.
నీ సహజావబోధనలూ మరియూ వారి అంతర్దృష్టీ అనెడి పుష్పగుచ్చాలను నీ ఆరాధనా పీఠం పై అర్పించే నీ ఆరాధకులైన దేవదూతలను నేను చేరెదను గాక.
by Paramahamsa Yogananda
.
No comments:
Post a Comment