'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము:
1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష్టి కలిగిన యువరాజు' అధిపతి అయినపుడు మనిషి సర్వస్వము నందు మంచినే చూచును. మంచి వస్తువులు, ప్రకృతి యందలి అద్భుతములు, మనోహరమైన దృశ్యాలు, దివ్య ప్పురుషుల ముఖములు, కళాకృతుల యందు ఆధ్యాత్మిక భావప్రకటన, దివ్య పురుషుల చిత్రములు - అటువంటి దృశ్యములన్నియు అనుభూతి రూపమున మనస్సు నందు చిత్రింపబడును. ఆలోచనలకు, సంకల్పములకు, అనుభూతులకు, అటువంటి చిత్రముల చలన చిత్ర రూపము కల్పింపబడి ప్రశాంతతను, ఆనందమును కలుగజేసి, వాటి నిర్దేశములను స్వీకరించును.
నీచమైన దృష్టి కలిగిన యువరాజు ప్రతిపాదించిన 'అహము ' రాజ్యమందలి చలన చిత్రములు సంఘర్షణలతో కూడిన చిత్రముల యందు, అసహ్యకరమైన ప్రదేశముల యందు వాటికి సంబంధించిన సందేశములను అందించును. ప్రలోభపెట్టు, చెడును ప్రేరేపించు ముఖములు, ఇంద్రియ చపలత్వమును కలిగించు కళాకృతులు, ఇంద్రియ భోగ సంబంధమైన, ప్రాపంచిక స్థితికి చెందిన సూచనలు - ఇవన్నియు మెదడు నందు ఒక ప్రవాహము వలె కుమ్మరించబడును. దాని ఫలితముగా ప్రజ్ఞ కలిగిన కణజాలపు, ఆలోచనల యొక్క చక్కటి అభిరుచి పతనము గావించబడును.
'అహము ' అందమైన వస్తువులకు, అందమైన ముఖాలకు ఆకర్షింపబడుట వలన ఆ విధమైన ప్రవర్తన ప్రాపంచిక బంధములకు, భోగలాలసతకు దారితీయును. ఆత్మ అందమైన విషయముల యందు అంతటను దైవ సౌందర్య భావమును గ్రహించి, ఆ అనుభవము మూలముగా తన చైతన్యము నందు దివ్యానందము, ప్రేమ వికసించిన అనుభూతిని పొందును.
2. వినికిడికి చెందిన ప్రదేశము: ఆత్మ పరిపాలన యందు వినికిడికి చెందిన ప్రాంతమును "సత్యమును విను యువరాజు" పాలించును. అట్టి పరిపాలన యందు శ్రవణేంద్రియము ప్రయోజనమును చేకూర్చు సత్య వాక్కులను వినగోరును. సత్య వాక్కులు మనిషి యొక్క ఆలోచనలను జ్ఞానము దిశగా నడిపించును.
'అహము' యొక్క పరిపాలన యందు "పొగడ్తల యువరాజు" కేవలము కృత్రిమముగా మాధుర్యము నింపబడిన విషపూరిత అబద్ధాలను వినగోరును. దాని ఫలితముగా అబద్ధముతో కూడిన స్వయం సమృద్ధి, మరియు తనపై తనకు అజ్ఞాన పూరిత అవగాహన ఏర్పడును. అందువల్ల వ్యక్తికి దుష్కృత్యములు చేయడము వల్ల ఏ విధమైన శిక్షా వుండదు - అను నమ్మకము ఏర్పడును. దాని ఫలితముగానే ప్రపంచము నందు చిన్న చిన్న నిరంకుశులు, పెద్ద నియంతృత్వపు వ్యక్తులు ఏర్పడుచున్నారు.
చిత్తశుద్ధితో కూడిన తీయటి పలుకుల వలన వ్యక్తులు సత్కార్యములను చేయుటకు ప్రోత్సహించబడెదరు. పొగడ్త, అబద్ధపు మాటలు మిక్కిలి హానికరమైనవి. అటువంటి మాటలు మానసిక గాయములను కప్పిపుచ్చును. చివరకు ఆ గాయాలు కుళ్ళి, మనిషినంతటినీ విషపూరితము చేయును. పొగడ్త అనేది విషపూరితమైన తేనె వంటిది.
ఒక వ్యక్తి యొక్క స్వంత ఆలోచనలు తరచుగా అతనిని సత్యము నుండి వేరుచేయును. వ్యక్తి సాధారణముగా తన తప్పులను తానెన్నడూ అతని యందలి తీవ్రమైన మానసిక వ్రణములను అతను విశ్లేషించుకొనక, స్వీయ క్రమశిక్షణను పాటింపక, వాటిని దాచిపెట్టును. మానసిక వ్రణములను (ట్యూమర్స్) విశ్లేషణ అను కత్తిని ఉపయోగించి వాటిని తొలగించిన యెడల వ్యక్తి సన్మార్గుడగును. ఇతరుల నుండి పొగడ్తలు, తనను తాను సమర్థించుకొను అతని ఊహల గుసగుసలు వ్యక్తికి శ్రవణానందమును కలిగించును.
విషపూరితమైన పొగడ్తల మాటలకు మానవుని విజ్ఞత బందీ యగును. అనేకమంది వ్యక్తులు పరాన్నభుక్కుల వంటి స్నేహితుల తీయని పొగడ్తలను నిరంతరమూ పొందుటకై, వారు ఇష్టపూర్వకముగా తమ సమయాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్నీ, పేరు ప్రతిష్టలనూ, తమ శీలాన్నీ త్యాగము చేస్తారు. నిజానికి అనేకమంది వివేచనతో కూడిన విమర్శకన్నా పొగడ్తనే కోరుకుంటారు. ఒక వ్యక్తిని విశ్లేషించినపుడు అతని యందు వెలుగు చూసిన సత్యమైన విషయాలు ఆ వ్యక్తికి అనుకూలము కావని ఆ వ్యక్తి భావించినపుడు, ఆ వ్యక్తి ఆ సత్యమైన విషయాలను మిక్కిలి కోపముతో తిరస్కరిస్తాడు. అహం పూరిత వ్యక్తి ద్వేషించే న్యాయ పూరిత విశ్లేషణను ఎదుర్కొనడం లో వ్యక్తులు తమ అనుచిత ప్రవర్తనను వ్యక్తం చేస్తారు. అనేకమంది కఠిన పదములతో కూడిన సరియైన హెచ్చరికను లక్ష్యపెట్టక తమ దుర్మార్గపు స్నేహితుల యొక్క అశ్రద్ధతో కూడిన తత్వమును అనుసరించి, చివరకు వినాశనమును పొందిరి. తీయటి మాటలు చెప్పు పదిమంది అబద్ధాలకోరులతో స్వర్గమునందు వుండుటకన్ననూ, కఠినమైన మాటలు చెప్పు ఒక జ్ఞానితో నరకమున వుండుటయే మేలు. మూర్ఖులు స్వర్గమును నరకంగా మారుస్తారు. ఒక జ్ఞాని ఏ విధమైన నరకాన్నైనా స్వర్గంగా మారుస్తారు.
(సద్విమర్శ) మంచితనముతో చేసిన విమర్శను ప్రశాంతముగా స్వీకరించుట వలన అనేక లాభాలు ఒనగూరును. కటువైనదైననూ నిజమైన విమర్శను స్వీకరింప గలుగు వ్యక్తి ప్రశంసనీయుడు. అటువంటి వ్యక్తి ఇతరులు శ్రమకోర్చి తన బాగును ఉద్దేశించి చేసిన విమర్శను హృదయపూర్వకమైన చిరునవ్వుతో, కృతజ్ఞతా పూర్వకముగా స్వీకరించును. కొద్దిమంది మాత్రము దోషరహితమై యుందురు. ఇతరులు సముచితమైన విమర్శ చేసినపుడు, వ్యక్తి తన తప్పును ప్రశాంతతతో దిద్దుకొనవలెను. అంతియే కాని తాను చేసిన తప్పులకు ఇతరులను కారణముగా చూపరాదు.
నాకు తెలిసిన ఒక సాధు సత్పురుషునికి, ఒక స్నేహితుడు ఉండెడి వాడు. ఆ స్నేహితుడు మిక్కిలి పరుషమైన పదజాలముతో ఈ సాధుసత్పురుషుని విమర్శించుటకే తన సమయమంతటినీ వినియోగించెడి వాడు. సాధు సత్పురుషుని శిష్యుడొకరు ఒక దినము మిక్కిలి ముఖ్యమైన వార్తను కొని వచ్చెను. ఆ శిష్యుడు మిక్కిలి సంతోషముతో ఇట్లనెను, "గురువర్యా! మిమ్ములను తప్పులెన్ను మీ శతృవు పరమపదించెను." ఆ మాటలకు ఆ సాధువు కన్నీళ్ళతో ఈ విధముగా పలికెను, "నేను నిస్సహాయుడనైతిని. నా హృదయము బద్దలైనది. ఆధ్యాత్మిక విషయముల యందు నాకు గల చక్కని విమర్శకుడు మరణించెను." అనెను.
ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి ఈ విధముగా ఆత్మపరిశీలన గావించుకొనవలెను. "ఈ రోజు నేను సున్నితమైన లేక పరుషమైన విమర్శకు ఏ విధముగా స్పందించితిని? నా మిత్రులు పలికిన పలుకులతో కొద్దిగానైననూ లేక గొప్పగా నైననూ సత్యమున్నది అను దానిని ఆలోచింపకయే, నేను ఆ వాక్కులను తిరస్కరించితినా?".
అహము తనకు ప్రియమైన వారి నుండి తీయటి పొగడ్తలు మాత్రమే వినదలుచుకోదు. అది తాను సాధించిన దాని విషయమై పొగడ్త, మరియూ తన పట్ల వారి భక్తిని కూడ వినదలుచుకొనును. కానీ భ్రాంతికరమైన విషయమేమనగా ఈ ప్రపంచమందలి పేరు ప్రఖ్యాతుల కొరకైన పొగడ్త చంచలమైనదీ, అస్థిరమైనది మరియూ శాశ్వతమైన ప్రేమ కొరకు వాగ్దానములు చేసిన మనుషులు సైతము మరణించవలసినదే. మాతృమూర్తుల తీయని పలుకులు సైతము మూగబోవును. ఇవన్నియూ మరపు అను సమాధి యందు కప్పబడిపోవును. కానీ ఆత్మ మాత్రము దివ్యమైన ప్రేమికుడైన ఆ భగవంతుని స్వరమును వినగలిగి, అతని ఉనికినీ, అతని ప్రేమనూ, అతని సమ్మతినీ గ్రహింపగలుగును.
3.The Olfactory Estate: నాసికా ప్రదేశము: ఆత్మయొక్క మార్గదర్శకత్వము నందు "స్వచ్ఛమైన సుగంధపు యువరాజు " పుష్పముల సహజమైన సువాసనను, స్వచ్ఛమైన గాలిని, భక్తిని రేకెత్తించు దేవాలయపు పరిమళాన్ని, ఆరోగ్యాన్ని సమకూర్చే ఆహారపదార్థాల సువాసనను ఆస్వాదించును. "క్షుద్రమైన వాసనల యువరాజు"చే ఉపదేశాన్ని పొందిన ఆలోచనలు మరియు కణములు ఇంద్రియాలను ప్రేరేపించే ఘాటైన సుగంధాలను కోరుకొని, వాటిని అనుభవించును మరియు అనారోగ్య కరమైన, పోషకవిలువలు లేని గొప్ప సుగంధ ద్రవ్యముల రుచిగల ఆహారము యొక్క వాసనలతో వ్యక్తి ఆకలి అధికమగును. ఘ్రాణేంద్రియము బానిస అయినపుడు అది శరీరానికి శ్రేయస్సును గూర్చు సాత్వికమైన ఆహారముపై సహజమైన ఆకర్షణను కోల్పోవును. అది మాంసాహారపు వాసనలతో భోజనానంతర తీపి పదార్థములతో (desserts) కృత్రిమమైన వంటకాలతో ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరుచుకొనును. అటువంటి ఆహార పదార్థములు అన్నియూ శరీరానికి హానికరమైనవి.
"క్షుద్రమైన వాసనల యువరాజు " మత్తు పదార్థము యొక్క ధూమపానము యొక్క హానికరమైన వాసనలను అనుభవింప దగినవిగా భావించి వాటితో సంతోషించును. వ్యక్తి యందలి ఆలోచనలూ, మరియూ ఘ్రాణేంద్రియ కణములు "క్షుద్రమైన వాసనల యువరాజు " వలన ముతకబారి తమ సున్నితత్వమును కోలోప్యినపుడు, మనిషి ముఖము మధ్యనున్న్న ముక్కు మనిషిని అధికముగా భుజించు అత్యాశ వైపు నడీపించి అతనిని అనారోగ్యానికి గురిచేసి అతను మానసిక ప్రశాంతతను కోల్పోవునట్లు చేయును. "ఒక వ్యక్తి తన ముక్కును అనుసరింపవలెను అను పూర్వకాలపు సామెత ఒకటి కలదు. అనగా వ్యక్తి స్వచ్ఛమైన గాలిని పీల్చి సన్మార్గము వైపు నడువవచ్చును. లేక నీచమైన వాసనలను కోరి దుర్మార్గము వైపుగా నడువవచ్చును.
4. The Gustatory Estate: రుచికి చెందిన ప్రాంతము :
ఆత్మ పరిపాలనయందు 'సరైన ఆహారమును భుజించు యువరాజు ' జిహ్వ ప్రాంతమును పరిపాలించును. ఈ యువరాజు సహజమైన ఆకర్షణలచే నడిపింపబడి, పోషక విలువలు కలిగిన సరైన ఆహారాన్నీ, ప్రత్యేకించి తాజా పళ్ళను, సహజమైన వాసనలు కలిగిన తమ పోషక విలువలు నశింపని పచ్చి కూరగాయలను శరీరమునకు అందించును. రుచికి చెందిన ప్రాంతము : ఆత్మ పరిపాలనయందు 'సరైన ఆహారమును భుజించు యువరాజు ' జిహ్వ ప్రాంతమును పరిపాలించును. ఈ యువరాజు సహజమైన ఆకర్షణలచే నడిపింపబడి, పోషక విలువలు కలిగిన సరైన ఆహారాన్నీ, ప్రత్యేకించి తాజా పళ్ళను, సహజమైన వాసనలు కలిగిన తమ పోషక విలువలు నశింపని పచ్చి కూరగాయలను శరీరమునకు అందించును. ప్రకృతి సిద్ధమైన ఈ ఆహార పదార్థములు శరీరమందలి కణములను పోషించును మరియూ వాటికి రోగ నిరోధకశక్తిని కలిగించి వాటి యవ్వన శక్తిని కాపాడునట్లు సహాయపడును.
అహం పరిపాలనలో "అత్యాశ యువరాజు" అధికముగా ఉడికించిన పోషక విలువలు నశించిన హానికరమైన ఆహార పదార్థాల కోసము అసహజమైన తీవ్రమైన వాంఛను కల్పించును. దాని ఫలితముగా రుచికి చెందిన ఆలోచనలు, శరీర కణాలు అజీర్తి అనారోగ్యాన్ని పొంది దుర్బలమగును. అత్యాశ యువరాజు మనిషిని అతని ఆరోగ్యానికి అవసరమైన దాని కన్నా అధికముగా భుజించమని ప్రలోభపెట్టును. అనేకమంది చిన్నపిల్లలవలె రుచి ప్రలోభముచే రేకెత్తించబడి సరైన ఆహారపుటలవాట్ల నిబంధనలను ఉల్లంఘింతురు. అటువంటి వారు అజీర్ణపు బాధలచే/తూటాలచే బాధపడతారు. ఈ గాయాలు మళ్ళీ మళ్ళీ కలిగినచో ముందు ముందు జీవితమున అవి తీవ్రమైన జబ్బులుగా మారతాయి. శరీరమందలి ప్రతి పౌనూ అధికమైన అనవసరపు కండలు గుండెకు అదనపు భారాన్ని కలిగిస్తాయి. గుండె అనవసరమైన భాగాలకు కూడా రక్తాన్ని సరఫరా చేయవలసి వుంటుంది. అధిక బరువు కలిగిన వ్యక్తులకు దీర్ఘాయుష్షు వుండదని భీమా కంపెనీలు ధృవపరుస్తున్నాయి.
ప్రతి తరము నందు లక్షలాది ప్రజలు ప్రతి దినము ఆహార విషయమున అత్యాశతో జరుగు యుద్ధమునందు ఓడిపోవుచున్నారు. అట్టి జనులు అనారోగ్యమునకు బందీలవలె తమ జీవితములను గడుపుచూ అకాల మరణమును పొందుచున్నారు. సాధారణ మనుష్యుల యందు 1 జిహ్వయొక్క రుచి, 2.అదుపు లేని ఆహారపు అలవాట్ల జ్ఞాపకములు అనెడి దుష్ట సైనికులు, 3. ఆతురతతో ఆహారమును మ్రింగు అలవాటు, 4. మరియూ ఇతర చెడు అలవాట్లు ప్రతి దినమూ మంచికి చెందిన సైనికులపై విజయమును సాధించుచున్నవి. అంతర్గత మంచి సైనికులు అందించు 1. మితాహార సూచన, 2. సమతుల ఆహారము కొరకు సరియైన పదార్థముల ఎంపిక, 3. ఆహారమును బాగుగా నములుట మొదలైన ఇతర సూచనలను తిరస్కరింపబడుచున్నవి.
సరియైన ఆహారపుటలవాట్ల ప్రాంతము నందు ఆహారముపై అత్యాశ కలిగిన సైనికులను కొంత,కొంత అనుమతించిన వ్యక్తి క్రమముగ అనారోగ్యము అను శతృవులచే చుట్టుముట్టి ఉన్నట్లు గ్రహించును. ఒక వ్యక్తి కనుల ముందు ఉదయము, మధ్యాహ్నము రుచికరమైన ఆహార పదార్థములను వడ్డించి ఉన్న యెడల 'అత్యాశ యువరాజు ' ఆ వ్యక్తిని ప్రలోభపెట్టుటకై మానసిక గూఢచారులను పంపి, వారిచే అతని 'నిగ్రహశక్తులను ' భ్రాంతి యందుంచి అతని చెవుల వద్ద ఈ విధముగా పలికించును. "ఈ రోజు మరింత అధికముగా భుజింపుము. ఒక సంవత్సరము పిదప నీకేమగునో అని చింతింపవలదు. కావున ఈ రోజు అధికముగా భుజింపుము. అధికముగా భుజించుటను రేపటి నుండీ మానుకొన వచ్చును. నిన్నటి అజీర్తి, అనారోగ్యము హెచ్చరికను పట్టించుకొనకుము. ఈ రోజు ఆహారము ఎంత రుచికరముగా వున్నదో గమనింపుము. ఈ రోజు భుజింపుము. రేపటి చింత వలదు. రేపు నిశ్చయముగా ఏమి జరగనున్నదో ఎవరికి తెలియును? దాని గురించిన చింత ఎందులకు?
అత్యాశ యువరాజు మనిషిని ఓడించిన ప్రతి సారీ ఆ ఓటమి అతని శరీర సామ్రాజ్యము పై కొంత హానిని కల్పించును. ఆ హాని క్రమముగా పెద్ద్దదై, చక్కదిద్ద సాధ్యము కానిదై చివరకు మరణమును కల్పించును.
ఆత్మ సాక్షాత్కారమును ఆపేక్షించు సాధకుడు ప్రతిదినము ఆహారమును భుజించుటకు ముందు ఈ విధముగా తనను తాను ప్రశ్నించుకొనవలెను, "అత్యాశ యువరాజు మరియూ జిహ్వకు చెందిన గూఢచారులు బహుకాలము నుండి సరియైన ఆహారమును భుజించు యువరాజు తో యుద్ధము చేయుచున్నారు. ఎవరి పక్షము గెలుపు పొందుచున్నది?" అత్యాశ యువరాజు గెలుపు పొందుచున్నట్లు సాధకుడు గమనించిన యెడల, అతను నిగ్రహశక్తులను సమకూర్చి, వారికి ఆధ్యాత్మికమైన నిరోధకశక్తి యందు శిక్షణ నిచ్చి, (నిగ్రహశక్తిని బలపరచుకొని) మనిషిని నశింపజేయు తలపుతో అతి కౄరముగా అడుగులు వేయుచున్న అత్యాశ యువరాజు అను శతృవుతో పోరాడి గెలువమని వారికి ఆజ్ఞను ఇవ్వవలెను. అధ్యాత్మిక మార్గమున ప్రారంభదశయందున్న సాధకుడు తాను భుజించుటకు కూర్చున్నప్పుడు, తన చర్య తన అంతర్గతము నందు ఒక పక్షమునకు చెందిన సైన్యమును బలపరచుచున్నదని గ్రహింపవలెను. ఒక పక్షము దుఃఖించిన యెడల మరొక పక్షము సంతోషించును. ఆ రెండు పక్షముల యందు ఒక పక్షము మాత్రమే మనిషి యొక్క మిత్రుడు (సరైన ఆహారమును భుజించుట). రెండవ పక్షము అతని శతృవు.
5.స్పర్శకు చెందిన ప్రాంతము:
ఆత్మ పరిపాలన యన్దు శరీర స్పర్శకు చెందిన "ప్రశాంత స్పర్శ యువరాజు" అనుకూలమైన, హెచ్చుతగ్గులు లేని వాతావరణము, మితాహారమును, జీవితమున అత్యవసర విశయములు మాత్రమే ఇష్ట పడును. 'ప్రశాంత స్పర్శ యువరాజు సూర్యుని వెచ్చదనమును, ఆహ్లాదకరమైన చల్లనిగాలి అనుభూతిని ఇశ్టపడును. శరీరపు అలవాట్ల యన్దు సమగ్రత (ప్రాంప్ట్నెస్స్) , ప్రశాంతత, అప్రమత్తతతో కూడిన ఆరోగ్య కరమైన మరియూ హితకరమైన ఇతర శరీరపు అలవాట్లు - ఇవన్నియూ లెక్కకట్టిన విధముగా మనిషి ప్రశాంతతను కల్పించును. సమతుల్యమైన మనస్సు ను స్థిరముగా కలిగి యుండుట వలన "ప్రశాంత స్పర్శ యువరాజు" అత్యంత వేడి లేక అత్యంత చల్లదనము వలన అత్యంత కఠినము లేక అత్యంత మెత్తదనము వలన కలత చెందడు. అనగా ప్రకోపింపజేయు పరిస్థితులవలన లేక అనుకూలమైన పరిస్థితుల యందు , అదే విధముగా సౌకర్యవంతమైన లేక అసౌకర్యవన్తమైన పరిస్థితుల వలన కలత చెందడు. ఆ అంతర్గత ప్రశాంతత, బాహ్యప్రపంచపు కఠిన పరిస్థితుల నుండి అతనిని కాపాడుచుండును.
అహము అధీనమందున్న "విషయాసక్తి స్పర్శ యువరాజు" శరీరమును సౌకర్యములకు, విలాసాలకు అలవాటు చేయును. మరియు శృంగార కోరికలను కలుగజేయు భోగలాలసా భావములకు శరీరమును అలవాటు చేయును. ఈ యువరాజు పరిపాలన యందు శరీరమునకు సమ్మతి కాని విషయముల యందు, ఆలోచనల యందు, అదే విధముగా శరీర కణముల యందు అలజడిని రేకెత్తించును. మరియు శరీరమునకు బాధ, ప్రయాస కలుగునని భయపెట్టును. అతని పరిపాలన యందు శరీరము సోమరితనమునందు జడత్వము నందు ఆనందమును పొందును. అధిక నిద్ర వలన కలుగు మతిమరుపును అనుభవించును. "విషయాసక్తి స్పర్శ యువరాజు" ఆలోచనలను చంచలము గావించి శరీరము నన్దలి కణములను బలహీనముగను, సోమరిగను, వ్యాధిగ్రస్తముగను, అచేతనముగను మార్చును.
6. కంఠస్వర ప్రదేశము: ఆత్మ పరిపాలన యందలి "దయతో కూడిన సత్యవాక్కు యువరాజు" ఆలోచనలను, శరీర కణములను, చెవులకు ఇంపైన శ్రావ్యమైన పదములచే రమింపజేయును. ఆత్మను జాగృతము చేయు పాటలు, ప్రశాంతతను కల్పించు హృదయమును కరిగించు మాటలు, సత్యమునకు చెందిన ముఖ్యమైన మాటలు - ఇవన్నియూ ఆలోచనలను, శరీరమందలి కణజాలమును దైవకార్యములు చేయువిధముగా బోధన గావించి, వ్యక్తి ప్రేరణను కల్పించును. దాని ఫలితముగా వ్యక్తి మరియూ అతని సహచరులు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందెదరు.