సమాధి స్థితులు
సమాధి స్థితిలు - వాటిలో వున్న ఉన్న బేదములు
సవికల్ప సమాధి,
నిర్వికల్ప సమాధి,
సహజ సమాధి.
సవికల్ప సమాధి,
మనసును
తెలుసుకోవటమే సాధన లోని ప్రధానాంశం. పరిపరి విధాలుగా వెళ్ళే మనసును దైవం
పైకి ప్రయత్న పూర్వకంగా లగ్నం చేసే ప్రయత్నం సవికల్ప సమాధి.
మనసులోని ఆలోచనలను తగ్గించేందుకు మనం చేసే నామజపం సవికల్ప సమాధి అవుతుంది.
నిర్వికల్ప సమాధి...
దైవ చింతనలో దేహాన్ని, ప్రపంచాన్ని మరిచి ఉండటం నిర్వికల్ప సమాధి. ఏ చింతన లేకుండా దేహాన్ని.. ప్రపంచాన్ని.. మర్చిపోవటమే నిద్ర.
సహజ సమాధి...
నిరంతరం చైతన్య భావనతో ఉంటూనే.. ఈ ప్రపంచంలో జీవనం సాగించటం సహజ సమాధి.
వీటితో కుండలినీ శక్తికి మనస్సు కు వున్న సంబంధం...
మానవుని
శరీరం అంతా వ్యాపించి వున్న మనసునే యోగంలో కుండలిని అన్నారు. భక్తిలో మనసు
పొందే తాదాత్మ్యతనే యోగంలో ఊర్ధ్వ ముఖమైన కుండలినిగా చెపుతారు.
కుండలినీ
శక్తిని 'చుట్టుకొని వున్న పాము' తో పోలుస్తారు. మనం పాము తోకను
కదిలించినా, తలను కదిలించినా అది బుసకొడుతుంది. అలాగే మనలోని చైతన్య
స్రవంతి శరీరమంతా ఒకే విధంగా వ్యాపించి ఉంది...
|| ఓం నమః శివాయ ||
No comments:
Post a Comment