Monday, July 6, 2020

🌷ధ్యానంలో జీవించడం ఎలా🌷

🌷ధ్యానంలో జీవించడం ఎలా🌷

ధ్యానం చేస్తే సిద్ది పొందలేరు ధ్యానంలో జీవిస్తే సిద్ది పొందగలరు. యోగులు మునులు ఋషులు చేసిన నిరంతర అన్వేషణ అదే వారే సిద్ధ పురుషులు ప్రకృతిలో మమేకమైపోతారు అదే మోక్షం....

ధ్యానం అంటే ఎరుకలో నిద్ర లాంటిది, లేదా శ్రద్దగా శ్వాస పైన ధ్యాస,  లేదా" హం స " శ్వాసని  గమనిస్తూనే నియంత్రిస్తూనే పరిగెత్తే ఆలోచనలను ఒక స్థాయిలో ఆగిపోతే నీలో ని నిన్ను గమనించడం నిన్ను నువ్వు అన్వేషించడం ఇది ఆధ్యాత్మిక సమాధానం అయితే శాస్త్రీయంగా ధ్యానం వల్ల మనిషికి ప్రశాంతంగా ఉండటం ఆలోచన శక్తి పెరగటం, వివేకంతో పని చేయడం, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, దీనివల్ల రక్తపోటు, మధుమోహ వ్యాధి అదుపులో ఉండటం ఇవన్నీ ఉపయోగాలుగా తెలుసుకున్నారు ప్రయత్నం చేసి ప్రయోజనం పొందుతున్నారు.

ఒక చోట కూర్చుని కాసేపు ఏకాగ్రత గా మనసు నిలకడ చేస్తే ఇన్ని ప్రయోజనాల ఉంటే ధ్యానం లోనే జీవిస్తే జీవితం ఇంక ఎంత ఉన్నంతగా ఉంటుంది ఆలోచించండి. ధ్యానం చేయడం తెలుసు మరి ధ్యానం లోనే జీవించడం ఎలా ...

ధ్యానంలో జీవించడం అంటే పగలు రాత్రి ఒక చోట కూర్చుని ఉండిపోవడం కాదు.. ధ్యానం చేసే సమయంలో ఎలా అయితే ఏకాగ్రత ప్రశాంతత, గమనించడం ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం చేస్తారో అలాగే ఏ పని చేస్తున్నా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని అనవసరంగా ఆలోచించడం ఆందోళన చెందడం ఊహించుకుని బయపడటం ఇవన్నీ మనసుతో చేసే ఆలోచనలు ఈ ఆలోచనలు వల్ల అనారోగ్యం వస్తుంది కానీ ఫలితం ఉండదు.. కనుక అక్కరలేని ఆలోచనలు నియంత్రణ చేయడంతో మొదలు పెట్టాలి. మీ శ్రద్ద మీ ఆలోచన మీరు చేసే పని గురించి మటుకే ఆలోచించాలి దానిపైన ధ్యాస ఉండాలి ఇది ధ్యానం అవుతుంది, భోజనం చేస్తున్నారు ఆ పదార్థాలు దైవ స్మరణతో వేరే ఆలోచన చేయకుండా అది ప్రశాంతంగా తినాలి అది మీకు మంచి ఆరోగ్యం ఇస్తుంది అది కూడా ధ్యానం అవుతుంది విద్యార్థులు చదివే టప్పుడు వారి ధ్యాస దానిపైనే ఉండాలి వారి ఆలోచన లక్ష్యం పైనే ఉండాలి  ఇది ధ్యానం, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు వారు వారి లక్ష సాధన తప్పా వేరే ఆలోచించకపోవడం ధ్యానం. 

లేనివన్నీ ఊహించడం, ఎలా అయితే ఆ ఆలోచనా ప్రభావం ఆరోగ్యం పైన ప్రభావం చూపి అనారోగ్యం తెస్తుందో అలాగే మీ ఆలోచనా పద్దతి మార్చుకోవడం వల్ల మీ అనారోగ్యం తగ్గి త్వరగా కొలుకోగలుగుతారు మనసు బుద్ది ఆలోచనా విధానంతో మనిషి మహనీయులు అవుతున్నారు, మానసిక రోగులు అవుతున్నారు, రాక్షసులు అవుతున్నారు అంటే మనిషి యొక్క ఆలోచనా శక్తి ఆలోచనా విధానం వారిపైన ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్తం చేసుకోవాలి.  

ఆధ్యాత్మిక మార్గంలో ఉపాసకులు ఏ పనిలో ఉన్న ఎక్కడ ఉన్నా మనసు ఇష్ట దైవం పట్ల కేంద్రీకరించి దైవ నామ స్మరణ చేస్తూ మీ మనసు బుద్ది దైవం పట్ల ఉంచి మీ పనులు కొనసాగిస్తే అది అసలైన ధ్యానం అవుతుంది, ఒక మంత్రం కానీ నామం కానీ సంకల్పమ్ కానీ సిద్దించాలి అంటే ముఖ్యంగా చేయవలసినది మనసు లగ్నం చేయడం ఇది మానసిక పూజ అంటారు. శరీరంతో ఎన్ని ఉపచారాలు చేసిన ధ్యాస వేరే చోట ఉంటే ఆ పూజకు ఫలితం ఉండదు , కానీ ఉపచారాలు నేరుగా చేయకున్న మనసు లగ్నం చేస్తే  మీరు ఏది సమర్పిస్తే అది భగవంతుడు కి అందుతుంది. అంటే మనసుకి మానసిక ఉపాసనకు అంత శక్తి ఉంది అదే ధ్యానం అంటే.

మీరు దూరంగా ఉండి ఎవరిని అయినా తలుచుకుంటే అది అక్కడ వారికి తెలిసి వారు మీమల్ని తలుచుకుంటారు ఇది అందరికీ అనుభవమే, వ్యక్తులు మధ్య ఇలా జరుగుతున్నప్పుడు దైవాన్ని మీరు మనసులో నిత్యం ధ్యానం చేస్తే అది దైవానికి తెలియదా. సదా ఏదైతే ద్యానిస్తూ (ఆలోచిస్తూ) జినవం సాగిస్తామో మనలో ఆ లక్షణం నిలిచిపోతుంది అదే తత్వం నిండుపోతుంది. ఎందుకంటే ఆ ఊహకు తగట్టు దేహం ఆలోచన మారుపోతుంది ఈ ధ్యానం తపనగా మారిపోతే ఒక లక్ష్యం సాధించాలి అన్న సంకల్పంగా మారిపోతే అదే తపస్సు అవుతుంది. 

ఉదాహరణకు నా చిన్న వయసులో గుడిలో చేసే వినాయకుడు అభిషేకం చాలా ఆకర్షించేది ఎంతగా అంటే నాకు అలా చేయాలి అన్న పిచ్చి ఆశ, పిల్లలు వంట చేయడం చూసి వంటచేసే ఆట ఆడుకుంటారు, పెళ్లిచేసే ఆట, దొంగ పోలీస్ ఆట, ఇల్లుకట్టే ఆటలు ఇలా వారికి ఆసక్తి కలిగి ఆకర్షించిన ఆటలు ఆడుకుంటూ ఉంటారు.. నిర్మాణం ఆగిపోయిన గుడి ప్రాంగణంలో బయట పెట్టేసి వెళ్లిపోయిన వినాయకుడు నాలుగు అడుగుల విగ్రహం కంట పడింది చుట్టుపక్కల దొరికిన గడ్డిపూలు గన్నేరు పూలు ఆకులు ఇంట్లో తినడానికి ఇచ్చే అప్పలు కాయలు , అభిషేకం కి నీళ్లు కుంకుమ పసుపు కర్పూరం సేకరించుకుని ఇంక ఎంతో అంనందంగా ఆ వినాయకుడి విగ్రహానికి రోజు పూజలు చేసి ఆడుకునే దాన్ని తర్వాత అక్కడ నుండి వచ్చేసాక మళ్ళీ ఏమీ చేయాలి ఎలా స్వామికి మళ్ళీ అభిషేకం చేయాలి గర్భగుడి లోకి రానివ్వరు కదా కళ్ళు మూసుకుని స్వామి నా ఎదురుగా ఉనట్టు ప్రతిష్ఠ చేసుకుంటాను ఆ రూపంకి పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం, స్నానం, వస్త్రం , దండలతో అలంకారం, స్త్రోత్రం నైవేద్యం, హారతి ఇస్తున్నట్టు యధావిధిగా పూజ పూర్తి వేసి ఆనందంతో పరవశించిపోతూ స్వామిని దర్శనం చేసుకుని సంతోష పడే దాన్ని ఇలా ఎన్నో వేల సార్లు స్వామి కి మానసిక పూజ నాకు తెలియకుండానే నా ఆనందం కోసం చేశాను కానీ ఇది చాలా గొప్ప మానసిక ఉపాసన అని నాకు సిద్దించింది అని ఆ వయసుకి తెలియదు అలా స్వామికి చేయడంలో ఆనందం తప్పా ఏ కోరికతో చేయలేదు అందుకే ఏమో హిమాలయ స్వామి ఆశ్రమానికి వచ్చి నన్ను పిలిపించి గణపతి విద్య ఉపదేశం ఇచ్చి, వెల్లుపోయారు తర్వాత అక్కడ ఆశ్రమంలో అష్టాక్షరి మంత్రం,ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్ది కాలం వ్యవధిలో ఉపదేశం దక్కింది కానీ అన్నిటికన్నా ముందుగా చిన్నప్పుడే నాకు ఎవరో గణపతి మంత్రాన్ని, దత్త మంత్రాన్ని గుర్తు ఉండేలా నేర్పించారు ఇంక అదే జపం నిత్యం చేస్తూనే ఉండేదాన్ని బాల మంత్రం తర్వాత ఎప్పటికో ఈ గణపతి విద్య అనుగ్రహించబడింది. ధ్యానంలో రహస్యాలు, కేచరి మూల మంత్రాలు విధానాలు, ఇలాంటి ఎన్నో ఆశ్రమంలో అనుభవం ఉన్న గురువులు వయో వృద్ధులు వారి సూచనలు ఆదేశాలు నాకు ఎన్నో పాటాలు నేర్పింది.

నిరంతరం నామ జపం చేయమంటే మీకు శ్రద్ద ఉన్నా సాధ్యపడదు ఒక్కసారిగా మనసు ఆలోచన నియంత్రణకు రాదు అందుకే లక్ష జపం 20 రోజుల్లో ఒకే చోట కూర్చుని చేయలేరు కనుక ఏ పని చేస్తున్న జపం చేసుకుంటూ చేయడం మీకు అలవాటు  చేసాను అనుకున్న సమయానికి జపం పూర్తి చేయాలి అన్న సంకల్పమ్ మీలో శ్రద్దగా మారింది మీకు తెలియకుండానే శ్రమ  లేకుండా ప్రతిరోజూ అన్ని వేల సార్లు నామ జపం  చేసుకుంటూ మీ నిత్య కర్మలు ఆచరించడం అలవాటు అయిపోయింది అందులో మీకు కలిగే ఆనందాన్ని ప్రశాంతత అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఎన్నో గొప్ప అనుభూతులు నాతో చెప్పుకున్నారు స్వప్న సాక్షాత్కారం చాలా మందికి కలిగింది ఇప్పుడు మీరు ద్యానిస్తూ నే జీవిస్తున్నారు ధ్యానం లో జీవిస్తున్నారు.. ఇది ప్రతి ఒక్కరికి అలవాటు అయితే మీ జీవన విధానం లో మీలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది ఇప్పుడు మీరు ధ్యానం చేసిన త్వరగా ఏకాగ్రత కుదురుతుంది. ఇదే ధ్యానంలో జీవించడం ఎన్నో సమస్యలు మీ మనసు పైన ప్రభావం చూపించేవి ఇప్పుడు ఆ సమస్యలు మీకు ఉన్నాయి కానీ మీ మనసుపైన దాని ప్రభావం లేదు ధైర్యంగా ఉన్నారు ఈ ధైర్యం పొందటమే మీకు మంత్రం సిద్దించడం అంటే మీపై మీకు నమ్మకం కలగడం. ఇంకా ముందు ముందు మంత్రాన్ని మనలో శక్తిగా మార్చుకునే విధంగా సాధన చేసే విధానం తెలుసుకుని అలా ఉపాసన చేద్దాము.

కనపడకుండానే ఇన్ని నేర్పగలరా ఉపదేశించగలరా అని అనుమానం వద్దు ఎందుకంటే మనము ఉపాసన చేస్తున్నది అమ్మవారిని అమ్మవారు అంటే ప్రకృతి ప్రకృతి లోనే మనము ఉన్నాము ప్రకృతిలో మనము ఒక భాగం, నేను చేసే దేవీ ఉపాసన కానీ దానియొక్క సంకల్పమ్ దూరంగా ఉండి చెప్పినా మీకు ఇది వరకు సాధన ఆటంకం లేకుండా పూర్తి చేయగలిగారు ఎంతో మంది అంతటి మహాసంకల్పం ఎలా చేశారు అన్నారు కదా ప్రకృతిని సంకల్పమ్ చేస్తే ప్రకృతిలో ఉన్న మనము అనుభూతి పొందకుండా ఎలా ఉంటుంది అందుకే మీలో అంతటి స్పందన కలిగింది ఆ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. ఇంక ఏ ఉపాసనలో ఈ అనుభూతి చెందలేకపోవచ్చు ఎప్పుడూ మీకు కలగని అనుభూతికి కారణం మనము చేస్తున్న ఆరాధన ప్రకృతి స్వరూపం అయిన సృష్టి, స్థితి, లయ స్వరూపిణి అయిన శక్తి ఉపాసన , ఆరాధన చేసే కొద్దీ ఆమె మనకు త్వరాగా దగ్గర అవుతూ మనల్ని  దగ్గరకు తీసుకుంటుంది అందుకే అమ్మవారి త్వరగా అనుగ్రహిస్తారు అని అంటారు. ఇది మీరు ఇదివరకు గమనించక పోయిన ఇప్పుడు గమనించండి మనము ఉన్నది ప్రకృతి ఒడిలో అంటే తల్లి ఒడిలోని ఉన్నాము అందరూ ఒకే చోట ఉన్నాము కనుక నేను మీకు నేరుగా తెలియాల్సి పని లేదు అన్ని ఆమె వివరిస్తుంది వినిపిస్తుంది మనకు తెలుసుకోవాలి అన్న శ్రద్ద ఉండాలి అంతే.

🌷శ్రీ మాత్రే నమః🌷


No comments:

Post a Comment

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...