Monday, July 6, 2020

CORONA CARE

CORONA CARE
 
ఇంట్లో  పాజిటివ్ పేషంట్లతో  వున్న మిగిలిన వారు  గుర్తుంచుకోవలసిన అంశాలు:
-ఏ లక్షణాలు వస్తున్నాయి రాసి పెట్టుకోవాలి.
-ఒక మామూలు ఫ్లూ జ్వరం వచ్చినపుడు ఎలాంటి మానసిక పరిస్థితుల్లో వుంటామో ఇప్పుడూ అదే విధంగా వుండాలి. పక్కన వారికి వెంటనే అంటుకునే అవకాశం వుంటుంది కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఉప్పు, పసుపు కలిపిన వేడినీళ్లతో గొంతు గరగర లాడించాలి. రోజులో నాలుగైదు సార్లు చేసినా పర్లేదు. 
- వేడినీళ్లు మాత్రమే తాగాలి. ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగడం, పదార్ధాలు తినడం చేయొద్దు. ఏదైనా వేడిగా తినేయాలి.
- అల్లం (తగినంత), తులసి (గుప్పెడు), దాల్చిన (కొద్దిగా), ధనియాలు(గుప్పెడు), జీలకర్ర(ఒక స్పూన్) మిరియాలు (10)వేసి, ఒక రెండు చిటికెలు పసుపు ఒక లీటర్ లీళ్లలో 10-15 నిముషాలు మరిగించి కషాయం లాగా చేసుకుని రెండు మూడు సార్లుగా తాగొచ్చు. 
-కూరల్లో అల్లం, వెల్లుల్లి ఎక్కువ ఉండేట్లు చూసుకోవాలి. 
-రోజుకి కనీసం 4-5 లీటర్ల మంచినీళ్లు తీసుకోవాలి. 
-ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు ఎక్కువగా వుండేట్లు చూసుకోవాలి. చికెన్, మటన్ లాంటివి సూప్ లాగా చేసుకుని తాగితే బలం వుంటుంది. 
-ఒక  లీటర్ నీటిలో రెండు నిమ్మకాయలు చక్రాలుగా కోసి వేసేస్తే నీళ్లు తాగాలని అనిపించి నప్పుడు వేడినీళ్లతో ఈ నీటిని కలిపి తాగితే శరీరానికి విటమిన్ c బాగా అందుతుంది. ఒక లీటర్ నీళ్లు మధ్యాన్నం వరకూ వస్తాయి. తర్వాత మళ్లీ ఫ్రెష్ గా చేసుకోవాలి. 
-ఎక్కువ సేపు నిద్రపోవాలి.
 పాలల్లో పసుపు వేసి పిల్లలకు ఇవ్వాలి. టీ లో అల్లం వేసుకుంటే బాగుంటుంది. ముందు భయం తగ్గించుకుంటే సగం సమస్య తగ్గుతుంది.

No comments:

Post a Comment

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...