Monday, July 6, 2020

సమాధి స్థితులు

 సమాధి స్థితులు

సమాధి స్థితిలు -  వాటిలో వున్న ఉన్న బేదములు

సవికల్ప సమాధి,
నిర్వికల్ప సమాధి,
సహజ సమాధి.

సవికల్ప సమాధి,

మనసును తెలుసుకోవటమే సాధన లోని ప్రధానాంశం. పరిపరి విధాలుగా వెళ్ళే మనసును దైవం పైకి ప్రయత్న పూర్వకంగా లగ్నం చేసే ప్రయత్నం సవికల్ప సమాధి. 
మనసులోని ఆలోచనలను తగ్గించేందుకు మనం చేసే నామజపం సవికల్ప సమాధి అవుతుంది.

నిర్వికల్ప సమాధి...

దైవ చింతనలో దేహాన్ని, ప్రపంచాన్ని మరిచి ఉండటం నిర్వికల్ప సమాధి. ఏ చింతన లేకుండా దేహాన్ని.. ప్రపంచాన్ని.. మర్చిపోవటమే నిద్ర.

సహజ సమాధి...

నిరంతరం చైతన్య భావనతో ఉంటూనే.. ఈ ప్రపంచంలో జీవనం సాగించటం సహజ సమాధి.

వీటితో కుండలినీ శక్తికి మనస్సు కు వున్న సంబంధం...

మానవుని శరీరం అంతా వ్యాపించి వున్న మనసునే యోగంలో కుండలిని అన్నారు. భక్తిలో మనసు పొందే తాదాత్మ్యతనే యోగంలో ఊర్ధ్వ ముఖమైన కుండలినిగా చెపుతారు.

కుండలినీ శక్తిని 'చుట్టుకొని వున్న పాము' తో పోలుస్తారు. మనం పాము తోకను కదిలించినా, తలను కదిలించినా అది బుసకొడుతుంది. అలాగే మనలోని చైతన్య స్రవంతి శరీరమంతా ఒకే విధంగా వ్యాపించి ఉంది...

|| ఓం నమః శివాయ ||

పువ్వు పూయకుండా కాయ కాసే మారేడు చెట్టు.

పువ్వు పూయకుండా కాయ కాసే మారేడు చెట్టు.


అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు.

సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు.

🌺 మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది.
ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే

🌺 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!
అని తలుస్తాము.

🌺 దళములు దళములుగా ఉన్నవాటినే కోసిపూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది.అది మూడు,తొమ్మిది కూడా ఉంటాయి.

పాఠక దేవుళ్ళ కోరిక ప్రకారం మేము ఓన్లినె ంఉహుర్థాలు ఫేతురెస్, Fఒరైగ్న్ ఛలెందర్, జ్యోతిష్కులు, పూజారులు, వాస్తు నిపుణులు, సంఖ్యాశాస్త్రవేత్తలు ఫేతురెస్ చేర్చాము.ఈ ఫేతురెస్ పొందడానికి మా అప్ప్ ను వెంటనే ఉప్దతె చేయండి. 👉👉ఛ్లిచ్క్ హెరె👈👈

🌺 పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు.

🌺 మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.
అందులోమారేడు దళము ఒకటి.

🌺 మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనెశివలింగమునకు తగిలితేఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకేఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా,పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. ‘బాల్యం,యౌవనం,కౌమారంఈ మూడింటిని నీవు చూస్తావు’ అని ఆశీర్వదిస్తాడుట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.

🌺 మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి "శ్రీసూక్తం"లో ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’
(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము.

🌺 మనిషికి మూడు గుణములు,మూడు అవస్థలు ఉంటాయి. నాల్గవదానిలోకి వెళ్ళడు.నాల్గవది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.

🌺 మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది.

🌺 యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడుఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి, ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.

🌺 మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. ‘మా-రేడు’ తెలుగులోరాజు ప్రకృతి,రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.

🌺 అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడుపువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.

1 మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,

2 రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,

3 మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.

ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.

 

ప్రదోష వ్రతం

ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.

🌻 ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని, ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శనివారం నాడు ప్రదోష సమయంలో శివారాధన చేసినట్లయితే కర్మ దోషాలు పోయి సుఖశాంతులు పొందవచ్చు. శని కర్మ కారకుడు, శివుడు సంహార కారకుడు. కాబట్టి శని ప్రదోష సమయంలో శివారాధన చేయడం ఉత్తమం.

🌻 వ్రతం ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన స్నానంచేసి శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్తమయం వరకు గడపాలి. ఉపవాసం చేయలేనివారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు అంటే పాలు, పండ్లు వంటివి తీసుకుని గడపవచ్చు. సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. అయితే త్రయోదశి నాడు ఉడికించని పదార్థాలను స్వీకరించి, మరుసటి రోజు వండిన ఆహారం తీసుకోవాలి. సూర్యాస్తమయానికి ఒకటిన్నర గంటల మునుపు ప్రారంభమయ్యే ప్రదోషకాలం, సూర్యాస్తమయం తర్వాత ఒక గంట వరకూ ఉంటుంది. ఈ సమయంలోనే ప్రదోష వ్రతం నిర్వహించాలి. అంటే రెండున్నర గంటలపాటు పూజ జరుగుతుంది.

🌻 ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. సాయంత్రం ఈ పూజ జరుగుతుంది. ఏ వయసు వారైనా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రదోషవ్రతం ఆచరించవచ్చు. స్కంధపురాణం ప్రకారం ప్రదోష వ్రతం రెండు విధాలు. పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయడం మొదటి విధానం..కాగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం రెండవ విధానం. వ్రతం చేసేవారు ముందు గా గణేషు ని పూజించి తరువాత శివ పార్వతుల తో పాటు సుబ్రహ్మణ్యస్వామి, నంది పూజించాలి.

🌻 శివలింగానికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాల తో అభిషేకించి బిల్వదళాలతో పూజించాలి. తరువాత ప్రదోష వ్రత కథ , శివ పురాణ శ్రవణ చేయాలి. మహా మృత్యుంజయ మంత్రం ని108 సార్లు పఠించాలి. పూజ ముగించిన తరువాత శివాలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించిన అనేక రెట్ల ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోషం వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. అపవాదులు దూరమవుతాయి. వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది. సంతానం కలుగుతుంది. చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది.

🌷తల్లి గర్భం దేవాలయం🌷

🌷తల్లి గర్భం దేవాలయం🌷

తల్లి గర్భం గర్భగుడి కన్నా గొప్పది అక్కడ ఒక సృష్టి నిర్మాణం యొక్క ప్రణాళిక జరుగుతుంది, గర్భంతో ఉన్న సమయంలో మీ ఆలోచన అలవాటు మనసు ఎలా ఉంటే అలాంటి సంతానాన్ని మీరు సమాజానికి ఇస్తున్నారు అని తెలుసుకోండి. అయితే తల్లిదేన బాధ్యత తండ్రి స్వభావం రాదా అంటే కచ్చితంగా తండ్రిదే ప్రధమ బాధ్యత,ఎందుకు కంటే, తల్లి గర్భంలో కి చేరడానికన్నా ముందు 3 నెలలు ఆ కణం తండ్రి గర్భంలో ప్రాణం పోసుకుంటుంది మూడు నెలలు తర్వాత తల్లి గర్భంలోకి చేరుతుంది అలా చేరిన తర్వాత 9 నెలలు ఎదుగుతుంది, తర్వాత బిడ్డగా భూమి పైకి వస్తుంది శిశువు,ఆ మూడు నెలలు ఈ 9 నెలలు కలిపి  యాడాది కాలం గర్భంలో ఉండటం వల్ల12 నెలలు సం గా నిర్ణయించారు, సంవత్సరం కి ఆయువు లెక్కిస్తారు.  

తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోకి ప్రవేశించిన కణం ఆ సమయంలో తండ్రి యొక్క ఆలోచనలు పునికిపుచ్చు కుంటాడు అలాగే ఆ తల్లి గర్భంలో శిశువు ఎదిగే సమయంలో ఆమె బాధ సంతోషం ఆలోచనలు అనుగుణంగా బిడ్డ యొక్క మనస్తత్వం ఏర్పడుతుంది. కనుక సమాజానికి మీరు అందించే గొప్ప సంపద మీ సంతానం గా ఇచ్చేది గొప్ప వరం గా మారుతుందా శాపంగా మారుతుందా మీ చేతిలోనే ఉంటుంది. 

ఏ తత్వం తో దేహం ఏర్పడుతుందో దాని స్వభావం మనకు ఉంటుంది, ఎలా అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అలాగే మన దేహానికి కూడా ఆకర్షణ శక్తి ఆకర్షించే గుణం ఉంటుంది అనగా అందానికి సంబంధించిన విషయం అని వెంటనే అనుకుంటారు కాదు ,భూమి ఎలా అయితే విశ్వప్రాణశక్తితో ప్రతిదీ తన వైపుకి ఆకర్షిస్తుందో అలాగే మనిషి దేహానికి విశ్వప్రాణశక్తిని ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది ప్రతి నాడి కి ఒక బీజం ప్రతి బీజం యొక్క స్మరణ కి ధ్వనికి దేహంలో స్పందించే గుణం అలా స్పందించడం వల్ల కలిగే ప్రకంపనలు విద్యుత్ శక్తి కలిగి ఉంటుంది ఆ శక్తి శరీరంలో నిక్షిప్తమై కుండలినీ శక్తిని జాగృతం చేస్తుంది. దేహానికి భూమి తత్వం ఉంటుంది అని మనకు మన ఋషుల ఎప్పుడో తెలియచేసారు అందుకే ఎన్నో మృతకణాలు తో దేహం మట్టితోనే ఉంటుంది మంత్రం ఉచ్చారణ వల్ల దేహానికి కలిగే మార్పు దుర్వాసనని తొలగిస్తుంది దేహంలో అనేక మంచి మార్పులకు కారణం అవుతుంది, ఆహారం దేహాన్ని పోషిస్తే ధ్యానం ఆత్మ శక్తిని పోషిస్తుంది. భూమి తత్వం కలిగినది కనుక భూమి అవతారం అయిన వారాహి మూలాధారం లో ప్రథమంగా ఆరాధిస్తారు.. ధ్యానంలో మొదట కదలికలు కలిగిన సమయంలో అక్కడ రక్షించే దేవత వారాహి గా మీకు లలితా నామ వివరణలో వివరంగా తెలియచేశాను. కర్మను తొలగించే ప్రయత్నంలో అవరోధాలు తొలగిస్తుంది.

ఇదంతా తల్లి గర్భంలో జరిగే సృష్టి ఈ సృష్టిని ఎవరు చేస్తున్నారు అమ్మవారు ,అమ్మవారు ఉంటే తల్లిగర్భం గర్భగుడితో సమానం. అలాగే పురుడు అంటే  మైలు అంటారు దానికి కారణం స్త్రీ లలో మైలుగా వ్యర్థం అవుతున్నది తల్లి గర్భంలో బిడ్డకు ఆహారంగా దేహం ఎదుగుదలకు కారణం అవుతుంది. ఆ మైలు రుదిరం పిండానికి ఎదుగుదలకు కారణం అవ్వడం వల్ల వారికి ఆసమయంలో బహిష్టు ఉండదు బిడ్డకు రక్షణగా ఉండే ఉమ్మనీరు వల్ల బిడ్డ క్షేమంగా కదులుతాడు, పురుడు తర్వాత ఆ వ్యర్థం అంతా విసర్జించడం వల్ల పురిటి మైలుని పాటిస్తారు ,తల్లి వేరుని తెంచుకుంటాడు కనుక అది చాలా పెద్ద మైలే అవుతుంది. 

గర్భంలో ఈ ఉమ్మ నీరు గతజన్మ పాప పుణ్యాలు గుర్తు చేస్తుంది బిడ్డ రూపంలో ఉండే జీవి ఆ దుర్వాసనని వైతరిణి నది దాటే టప్పుడు కలిగిన బాధని అనుభవిస్తూ ఆ కర్మను పూర్తి చేసుకుని నీ దగ్గరకు వస్తాను స్వామి మళ్ళీ జన్మ లేకుండా ఇటువంటి బాధను అనుభవించకుండా కాపాడు అని వేడుకుంటూ ఉంటాడు. పుట్టిన మూడు నెలలకు గత జన్మ జ్ఞాపకాలను మర్చిపోయి ఈ జన్మ వాసనలకు అలవాటు పడుతూ ఈ జన్మ బంధాలకు దగ్గర అవుతూ మాయలో పడిపోతాడు గర్భంలో తల్లిదండ్రులు యొక్క స్వభావం తో అదే మనస్తత్వం తో ఎదుగుతారు. ఆధ్యాత్మిక సంపాదన కలిగిన జీవి ఆ గతజన్మ పుణ్యం వల్ల ఆ మార్గం లో నడుస్తాడు ప్రలోభాలకు లొంగకుండా మాయనుండి బయటపడే మార్గాన్ని అన్వేషించండి మొదలు పెడతాడు.

మంచి ఆలోచన గలిగిన విషయాలు కథలు సంతోషంగా ఉండే మాటలు, అత్యత్మిక విషయాలు సంగీతం ఇలాంటి వన్ని గర్భం సమయంలో పాటిస్తే మంచి సంస్కారవంతులు గా ఉన్నతంగా  జన్మిస్తారు, మంచి జ్ఞానం ఉన్న పుస్తకాలు చదవటం దానం చేయడం ప్రేమగా ఉండటం వల్ల మీ పిల్లలు మీ పట్ల అదే స్వభావంతో ఎదుగుతారు, అలా అని మీరు చెడ్డవాళ్ళ మీకు అలాంటి పిల్లలు ఉన్నారు అనుకోకండి మీరు  మంచి వాళ్ళు అయినా మీరు చూసే tv సీరియల్స్ వినే విషయాలు తగాదాలు క్రిమినల్ కథలు ఇటువంటి చూడటం వినటం, భయపడటం ఆస్థి తగాదాలు కట్నం గొడవలు ఇటువంటి వాటి వల్ల మీ సమస్య మనసుపైన ప్రభావం చూపడం వల్ల అది బిడ్డ అలోచనలు పైన ప్రభావం చూపుతుంది.

జన్మ అంటే ఋణం ఎవరికి ఋణపడి ఉంటామో వారే జన్మిస్తారు ఎవరు మనకు ఋణపడి ఉంటారో వాళ్ళు జన్మిస్తారు, ఉదాహరణకు ఒక తల్లి మంచి మనసుతో ఒక సాధువుకు ఆహారాన్ని ఇస్తూ ఉండేది ఏంతో కాలం ఆమె భక్తితో అలా ఆహారాన్ని ఇస్తుండటం తో ఆ సాధువుకి ఆమె పట్లమాతృత్వపు మమకారం కలిగింది అమెపట్ల ఒక ఆపేక్ష అనురాగం ఆ సాధువు హృదయం లో కలగడంవల్ల సాధన ద్వారా పుణ్యము పాపము అనే రెండు కర్మలు వదిలిపోయినా, మోక్షానికి వెళ్లకుండా మళ్ళీ జన్మ లో అమెకు బిడ్డగా జన్మించి మాతృత్వం యొక్క మమకారం తీర్చుకుని ఆ తల్లిదండ్రులకు ఎనలేని కీర్తిని సంపాదనగా ఇచ్చి తరతరాలుకు తరింప చేస్తారు అటువంటి వారే, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, అబ్దుల్ కలాం గారు, ఇంకా ఇలాంటి ఎందరో మహానుభావులు.

ఒక యోధుడిని ఒక వీరుడిని, ఒక యోగిని, ఒక శాస్త్రవేత్త ని, ఒక రాముడిని, ఒక శివాజీ ని ఇలాంటి మహానుభావులను కనే శక్తి మనకు ఉంది. ఒక రావణుడు, నరకాసురుడు, కీచకుడుని కనే శక్తి కూడా మనకే ఉంది. మంచి కర్మలు మంచి ఆలోచనలు తో మంచి సంతానాన్ని మంచి పెంపకంతో గొప్ప సమాజాన్ని నిర్మించేశక్తి కూడా మనకు ఉంది ఇది గుర్తు పెట్టుకోండి.

👉 సంతానం లేని దంపతులు పాపాత్ములు కారు, ఎవరికి ఋణపడని వాళ్ళు అని అర్థం, వారికి ఎవరూ ఋణం లేరు అని అర్తం కనుక సంతానం లేని వాళ్ళు బాధపడకండి ఎవరికీ మీరు ఋణపడలేదు అనుకోండి పుణ్యకార్యాలు  చేస్తూ జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా జీవించి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోండి. పార్వతీ దేవి ఒక్క బిడ్డను కూడా తన గర్భంలో మోయలేదు కానీ ఆమె ఈ సృష్టికి తల్లి అలాగే గర్భం లో మోయకున్నా తల్లి మనసు ఉంటే బిడ్డను పెంచుకోవచ్చు. బాధ సంతోషం అనేది మనము స్వీకరించే దాన్నిబట్టి ఉంటుంది. 

హిందూ సంప్రదాయంలోని ఉపాసన కి ఒక ప్రత్యేకత ఉంది అదేమంటే ఉపాసన ద్వారా నువ్వు పొందే శక్తి వల్ల నువ్వు దేవత కావచ్చు రాక్షసుడు కావచ్చు ఆ శక్తిని ఎలా మలుచుకుని అది నువ్వుగా మారాలి అనుకుంటావో  అది నీ బుద్దిని బట్టే ఉంటుంది

🌷శ్రీ మాత్రే నమః🌷




🌷ధ్యానంలో జీవించడం ఎలా🌷

🌷ధ్యానంలో జీవించడం ఎలా🌷

ధ్యానం చేస్తే సిద్ది పొందలేరు ధ్యానంలో జీవిస్తే సిద్ది పొందగలరు. యోగులు మునులు ఋషులు చేసిన నిరంతర అన్వేషణ అదే వారే సిద్ధ పురుషులు ప్రకృతిలో మమేకమైపోతారు అదే మోక్షం....

ధ్యానం అంటే ఎరుకలో నిద్ర లాంటిది, లేదా శ్రద్దగా శ్వాస పైన ధ్యాస,  లేదా" హం స " శ్వాసని  గమనిస్తూనే నియంత్రిస్తూనే పరిగెత్తే ఆలోచనలను ఒక స్థాయిలో ఆగిపోతే నీలో ని నిన్ను గమనించడం నిన్ను నువ్వు అన్వేషించడం ఇది ఆధ్యాత్మిక సమాధానం అయితే శాస్త్రీయంగా ధ్యానం వల్ల మనిషికి ప్రశాంతంగా ఉండటం ఆలోచన శక్తి పెరగటం, వివేకంతో పని చేయడం, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, దీనివల్ల రక్తపోటు, మధుమోహ వ్యాధి అదుపులో ఉండటం ఇవన్నీ ఉపయోగాలుగా తెలుసుకున్నారు ప్రయత్నం చేసి ప్రయోజనం పొందుతున్నారు.

ఒక చోట కూర్చుని కాసేపు ఏకాగ్రత గా మనసు నిలకడ చేస్తే ఇన్ని ప్రయోజనాల ఉంటే ధ్యానం లోనే జీవిస్తే జీవితం ఇంక ఎంత ఉన్నంతగా ఉంటుంది ఆలోచించండి. ధ్యానం చేయడం తెలుసు మరి ధ్యానం లోనే జీవించడం ఎలా ...

ధ్యానంలో జీవించడం అంటే పగలు రాత్రి ఒక చోట కూర్చుని ఉండిపోవడం కాదు.. ధ్యానం చేసే సమయంలో ఎలా అయితే ఏకాగ్రత ప్రశాంతత, గమనించడం ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం చేస్తారో అలాగే ఏ పని చేస్తున్నా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని అనవసరంగా ఆలోచించడం ఆందోళన చెందడం ఊహించుకుని బయపడటం ఇవన్నీ మనసుతో చేసే ఆలోచనలు ఈ ఆలోచనలు వల్ల అనారోగ్యం వస్తుంది కానీ ఫలితం ఉండదు.. కనుక అక్కరలేని ఆలోచనలు నియంత్రణ చేయడంతో మొదలు పెట్టాలి. మీ శ్రద్ద మీ ఆలోచన మీరు చేసే పని గురించి మటుకే ఆలోచించాలి దానిపైన ధ్యాస ఉండాలి ఇది ధ్యానం అవుతుంది, భోజనం చేస్తున్నారు ఆ పదార్థాలు దైవ స్మరణతో వేరే ఆలోచన చేయకుండా అది ప్రశాంతంగా తినాలి అది మీకు మంచి ఆరోగ్యం ఇస్తుంది అది కూడా ధ్యానం అవుతుంది విద్యార్థులు చదివే టప్పుడు వారి ధ్యాస దానిపైనే ఉండాలి వారి ఆలోచన లక్ష్యం పైనే ఉండాలి  ఇది ధ్యానం, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు వారు వారి లక్ష సాధన తప్పా వేరే ఆలోచించకపోవడం ధ్యానం. 

లేనివన్నీ ఊహించడం, ఎలా అయితే ఆ ఆలోచనా ప్రభావం ఆరోగ్యం పైన ప్రభావం చూపి అనారోగ్యం తెస్తుందో అలాగే మీ ఆలోచనా పద్దతి మార్చుకోవడం వల్ల మీ అనారోగ్యం తగ్గి త్వరగా కొలుకోగలుగుతారు మనసు బుద్ది ఆలోచనా విధానంతో మనిషి మహనీయులు అవుతున్నారు, మానసిక రోగులు అవుతున్నారు, రాక్షసులు అవుతున్నారు అంటే మనిషి యొక్క ఆలోచనా శక్తి ఆలోచనా విధానం వారిపైన ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్తం చేసుకోవాలి.  

ఆధ్యాత్మిక మార్గంలో ఉపాసకులు ఏ పనిలో ఉన్న ఎక్కడ ఉన్నా మనసు ఇష్ట దైవం పట్ల కేంద్రీకరించి దైవ నామ స్మరణ చేస్తూ మీ మనసు బుద్ది దైవం పట్ల ఉంచి మీ పనులు కొనసాగిస్తే అది అసలైన ధ్యానం అవుతుంది, ఒక మంత్రం కానీ నామం కానీ సంకల్పమ్ కానీ సిద్దించాలి అంటే ముఖ్యంగా చేయవలసినది మనసు లగ్నం చేయడం ఇది మానసిక పూజ అంటారు. శరీరంతో ఎన్ని ఉపచారాలు చేసిన ధ్యాస వేరే చోట ఉంటే ఆ పూజకు ఫలితం ఉండదు , కానీ ఉపచారాలు నేరుగా చేయకున్న మనసు లగ్నం చేస్తే  మీరు ఏది సమర్పిస్తే అది భగవంతుడు కి అందుతుంది. అంటే మనసుకి మానసిక ఉపాసనకు అంత శక్తి ఉంది అదే ధ్యానం అంటే.

మీరు దూరంగా ఉండి ఎవరిని అయినా తలుచుకుంటే అది అక్కడ వారికి తెలిసి వారు మీమల్ని తలుచుకుంటారు ఇది అందరికీ అనుభవమే, వ్యక్తులు మధ్య ఇలా జరుగుతున్నప్పుడు దైవాన్ని మీరు మనసులో నిత్యం ధ్యానం చేస్తే అది దైవానికి తెలియదా. సదా ఏదైతే ద్యానిస్తూ (ఆలోచిస్తూ) జినవం సాగిస్తామో మనలో ఆ లక్షణం నిలిచిపోతుంది అదే తత్వం నిండుపోతుంది. ఎందుకంటే ఆ ఊహకు తగట్టు దేహం ఆలోచన మారుపోతుంది ఈ ధ్యానం తపనగా మారిపోతే ఒక లక్ష్యం సాధించాలి అన్న సంకల్పంగా మారిపోతే అదే తపస్సు అవుతుంది. 

ఉదాహరణకు నా చిన్న వయసులో గుడిలో చేసే వినాయకుడు అభిషేకం చాలా ఆకర్షించేది ఎంతగా అంటే నాకు అలా చేయాలి అన్న పిచ్చి ఆశ, పిల్లలు వంట చేయడం చూసి వంటచేసే ఆట ఆడుకుంటారు, పెళ్లిచేసే ఆట, దొంగ పోలీస్ ఆట, ఇల్లుకట్టే ఆటలు ఇలా వారికి ఆసక్తి కలిగి ఆకర్షించిన ఆటలు ఆడుకుంటూ ఉంటారు.. నిర్మాణం ఆగిపోయిన గుడి ప్రాంగణంలో బయట పెట్టేసి వెళ్లిపోయిన వినాయకుడు నాలుగు అడుగుల విగ్రహం కంట పడింది చుట్టుపక్కల దొరికిన గడ్డిపూలు గన్నేరు పూలు ఆకులు ఇంట్లో తినడానికి ఇచ్చే అప్పలు కాయలు , అభిషేకం కి నీళ్లు కుంకుమ పసుపు కర్పూరం సేకరించుకుని ఇంక ఎంతో అంనందంగా ఆ వినాయకుడి విగ్రహానికి రోజు పూజలు చేసి ఆడుకునే దాన్ని తర్వాత అక్కడ నుండి వచ్చేసాక మళ్ళీ ఏమీ చేయాలి ఎలా స్వామికి మళ్ళీ అభిషేకం చేయాలి గర్భగుడి లోకి రానివ్వరు కదా కళ్ళు మూసుకుని స్వామి నా ఎదురుగా ఉనట్టు ప్రతిష్ఠ చేసుకుంటాను ఆ రూపంకి పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం, స్నానం, వస్త్రం , దండలతో అలంకారం, స్త్రోత్రం నైవేద్యం, హారతి ఇస్తున్నట్టు యధావిధిగా పూజ పూర్తి వేసి ఆనందంతో పరవశించిపోతూ స్వామిని దర్శనం చేసుకుని సంతోష పడే దాన్ని ఇలా ఎన్నో వేల సార్లు స్వామి కి మానసిక పూజ నాకు తెలియకుండానే నా ఆనందం కోసం చేశాను కానీ ఇది చాలా గొప్ప మానసిక ఉపాసన అని నాకు సిద్దించింది అని ఆ వయసుకి తెలియదు అలా స్వామికి చేయడంలో ఆనందం తప్పా ఏ కోరికతో చేయలేదు అందుకే ఏమో హిమాలయ స్వామి ఆశ్రమానికి వచ్చి నన్ను పిలిపించి గణపతి విద్య ఉపదేశం ఇచ్చి, వెల్లుపోయారు తర్వాత అక్కడ ఆశ్రమంలో అష్టాక్షరి మంత్రం,ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్ది కాలం వ్యవధిలో ఉపదేశం దక్కింది కానీ అన్నిటికన్నా ముందుగా చిన్నప్పుడే నాకు ఎవరో గణపతి మంత్రాన్ని, దత్త మంత్రాన్ని గుర్తు ఉండేలా నేర్పించారు ఇంక అదే జపం నిత్యం చేస్తూనే ఉండేదాన్ని బాల మంత్రం తర్వాత ఎప్పటికో ఈ గణపతి విద్య అనుగ్రహించబడింది. ధ్యానంలో రహస్యాలు, కేచరి మూల మంత్రాలు విధానాలు, ఇలాంటి ఎన్నో ఆశ్రమంలో అనుభవం ఉన్న గురువులు వయో వృద్ధులు వారి సూచనలు ఆదేశాలు నాకు ఎన్నో పాటాలు నేర్పింది.

నిరంతరం నామ జపం చేయమంటే మీకు శ్రద్ద ఉన్నా సాధ్యపడదు ఒక్కసారిగా మనసు ఆలోచన నియంత్రణకు రాదు అందుకే లక్ష జపం 20 రోజుల్లో ఒకే చోట కూర్చుని చేయలేరు కనుక ఏ పని చేస్తున్న జపం చేసుకుంటూ చేయడం మీకు అలవాటు  చేసాను అనుకున్న సమయానికి జపం పూర్తి చేయాలి అన్న సంకల్పమ్ మీలో శ్రద్దగా మారింది మీకు తెలియకుండానే శ్రమ  లేకుండా ప్రతిరోజూ అన్ని వేల సార్లు నామ జపం  చేసుకుంటూ మీ నిత్య కర్మలు ఆచరించడం అలవాటు అయిపోయింది అందులో మీకు కలిగే ఆనందాన్ని ప్రశాంతత అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఎన్నో గొప్ప అనుభూతులు నాతో చెప్పుకున్నారు స్వప్న సాక్షాత్కారం చాలా మందికి కలిగింది ఇప్పుడు మీరు ద్యానిస్తూ నే జీవిస్తున్నారు ధ్యానం లో జీవిస్తున్నారు.. ఇది ప్రతి ఒక్కరికి అలవాటు అయితే మీ జీవన విధానం లో మీలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది ఇప్పుడు మీరు ధ్యానం చేసిన త్వరగా ఏకాగ్రత కుదురుతుంది. ఇదే ధ్యానంలో జీవించడం ఎన్నో సమస్యలు మీ మనసు పైన ప్రభావం చూపించేవి ఇప్పుడు ఆ సమస్యలు మీకు ఉన్నాయి కానీ మీ మనసుపైన దాని ప్రభావం లేదు ధైర్యంగా ఉన్నారు ఈ ధైర్యం పొందటమే మీకు మంత్రం సిద్దించడం అంటే మీపై మీకు నమ్మకం కలగడం. ఇంకా ముందు ముందు మంత్రాన్ని మనలో శక్తిగా మార్చుకునే విధంగా సాధన చేసే విధానం తెలుసుకుని అలా ఉపాసన చేద్దాము.

కనపడకుండానే ఇన్ని నేర్పగలరా ఉపదేశించగలరా అని అనుమానం వద్దు ఎందుకంటే మనము ఉపాసన చేస్తున్నది అమ్మవారిని అమ్మవారు అంటే ప్రకృతి ప్రకృతి లోనే మనము ఉన్నాము ప్రకృతిలో మనము ఒక భాగం, నేను చేసే దేవీ ఉపాసన కానీ దానియొక్క సంకల్పమ్ దూరంగా ఉండి చెప్పినా మీకు ఇది వరకు సాధన ఆటంకం లేకుండా పూర్తి చేయగలిగారు ఎంతో మంది అంతటి మహాసంకల్పం ఎలా చేశారు అన్నారు కదా ప్రకృతిని సంకల్పమ్ చేస్తే ప్రకృతిలో ఉన్న మనము అనుభూతి పొందకుండా ఎలా ఉంటుంది అందుకే మీలో అంతటి స్పందన కలిగింది ఆ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. ఇంక ఏ ఉపాసనలో ఈ అనుభూతి చెందలేకపోవచ్చు ఎప్పుడూ మీకు కలగని అనుభూతికి కారణం మనము చేస్తున్న ఆరాధన ప్రకృతి స్వరూపం అయిన సృష్టి, స్థితి, లయ స్వరూపిణి అయిన శక్తి ఉపాసన , ఆరాధన చేసే కొద్దీ ఆమె మనకు త్వరాగా దగ్గర అవుతూ మనల్ని  దగ్గరకు తీసుకుంటుంది అందుకే అమ్మవారి త్వరగా అనుగ్రహిస్తారు అని అంటారు. ఇది మీరు ఇదివరకు గమనించక పోయిన ఇప్పుడు గమనించండి మనము ఉన్నది ప్రకృతి ఒడిలో అంటే తల్లి ఒడిలోని ఉన్నాము అందరూ ఒకే చోట ఉన్నాము కనుక నేను మీకు నేరుగా తెలియాల్సి పని లేదు అన్ని ఆమె వివరిస్తుంది వినిపిస్తుంది మనకు తెలుసుకోవాలి అన్న శ్రద్ద ఉండాలి అంతే.

🌷శ్రీ మాత్రే నమః🌷


CORONA CARE

CORONA CARE
 
ఇంట్లో  పాజిటివ్ పేషంట్లతో  వున్న మిగిలిన వారు  గుర్తుంచుకోవలసిన అంశాలు:
-ఏ లక్షణాలు వస్తున్నాయి రాసి పెట్టుకోవాలి.
-ఒక మామూలు ఫ్లూ జ్వరం వచ్చినపుడు ఎలాంటి మానసిక పరిస్థితుల్లో వుంటామో ఇప్పుడూ అదే విధంగా వుండాలి. పక్కన వారికి వెంటనే అంటుకునే అవకాశం వుంటుంది కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఉప్పు, పసుపు కలిపిన వేడినీళ్లతో గొంతు గరగర లాడించాలి. రోజులో నాలుగైదు సార్లు చేసినా పర్లేదు. 
- వేడినీళ్లు మాత్రమే తాగాలి. ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగడం, పదార్ధాలు తినడం చేయొద్దు. ఏదైనా వేడిగా తినేయాలి.
- అల్లం (తగినంత), తులసి (గుప్పెడు), దాల్చిన (కొద్దిగా), ధనియాలు(గుప్పెడు), జీలకర్ర(ఒక స్పూన్) మిరియాలు (10)వేసి, ఒక రెండు చిటికెలు పసుపు ఒక లీటర్ లీళ్లలో 10-15 నిముషాలు మరిగించి కషాయం లాగా చేసుకుని రెండు మూడు సార్లుగా తాగొచ్చు. 
-కూరల్లో అల్లం, వెల్లుల్లి ఎక్కువ ఉండేట్లు చూసుకోవాలి. 
-రోజుకి కనీసం 4-5 లీటర్ల మంచినీళ్లు తీసుకోవాలి. 
-ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు ఎక్కువగా వుండేట్లు చూసుకోవాలి. చికెన్, మటన్ లాంటివి సూప్ లాగా చేసుకుని తాగితే బలం వుంటుంది. 
-ఒక  లీటర్ నీటిలో రెండు నిమ్మకాయలు చక్రాలుగా కోసి వేసేస్తే నీళ్లు తాగాలని అనిపించి నప్పుడు వేడినీళ్లతో ఈ నీటిని కలిపి తాగితే శరీరానికి విటమిన్ c బాగా అందుతుంది. ఒక లీటర్ నీళ్లు మధ్యాన్నం వరకూ వస్తాయి. తర్వాత మళ్లీ ఫ్రెష్ గా చేసుకోవాలి. 
-ఎక్కువ సేపు నిద్రపోవాలి.
 పాలల్లో పసుపు వేసి పిల్లలకు ఇవ్వాలి. టీ లో అల్లం వేసుకుంటే బాగుంటుంది. ముందు భయం తగ్గించుకుంటే సగం సమస్య తగ్గుతుంది.

DIVINE TIMINGS

DIVINE TIMINGS



* BRAHMA MUHURTHAM

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం*. ఈ ముహూర్తానికి అధిదేవత *బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది*. సూర్యోదయం అవడానికి, *98-48 నిమిషాల మధ్యకాలం ఇది.

🌸 నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ
🌸 బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. *బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు*. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?
🌸 ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

🌸 ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. *ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు*.

🌸 చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

🌸 బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

🌸 *బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు*. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది... 

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...