Wednesday, May 15, 2024

1.1 రాజైన ఆత్మ పరిపాలనయందు శరీర సామ్రాజ్యము

 



 రాజైన "ఆత్మ" పరిపాలనయందు శరీర సామ్రాజ్యము 

శరీరమందలి ప్రతీ భాగమునకు (కర్మేంద్రియాలు + జ్ఞానేంద్రియాలూ) ఆ శరీరభాగము చేయు పనిని అనుసరించి, దృష్టాంత పూర్వకముగా దానిని వివరించెడి పేరును ఏర్పరచి, 

1. ఆ శరీర భాగములు వాటిని పరిపాలించువారిని అనుసరించి (పరిపాలించెడివారు ఆత్మయా లేక అహమా)

2. అందు నివసించు వారిని అనుసరించి (చక్రాల్లోని శక్తులు - ఆత్మ పరిపాలనా లేక అహం పరిపాలనా)

ఆ శరీరభాగములు ఏ విధముగా ప్రభావితము అగునో అనునది స్పష్టంగా తెలియజేయవచ్చును. 17వ పేజీ నందలి చిత్రము రాజైన ఆత్మ యొక్క పరిపాలన యందు శరీర సామ్రాజ్యము వుండు విధమును సూచించును. 

 పెద్దమెదడు, మెడుల్లా యందు వసించు అధిచేతన, క్రీస్తు చైతన్యము మరియూ విశ్వ చైతన్య స్థావరమును ఆత్మ యొక్క రాచరికపు భవనము (రాయల్ పాలెస్) అందురు. రాజైన ఆత్మ ఆ స్థావరము నుండి తన దివ్యానంద అనుగ్రహమును, జ్ఞానమునూ, శక్తినీ, శరీర సామ్రాజ్యమున కంతటికీ అనుగ్రహించును. 

 మెడుల్లా, విశుద్ధ, అనాహత చక్రస్థానములు ఉన్నత చైతన్య స్థావరములు. వీటిని పెద్దల సభ లేక ఎగువ సభ అని పిలువ వచ్చును. ఈ స్థావరముల యందలి దివ్యమైన విచక్షణా శక్తులు మిక్కిలి విశ్వాస పూరిత పౌరులవలె రాజైన ఆత్మకు సహాయమును అందించెదరు. ఈ విచక్షణా శక్తులు 'బుద్ధి ' అను ప్రధానమంత్రి అధీనమున వుందురు. బుద్ధి అనునది సత్యమును తెలుపును మరియూ పరమాత్మ వైపు ఆకర్షితమై వుండును. 

మణిపూరక, స్వాధిష్ఠాన, మూలాధార చక్ర స్థానములు దిగువ చైతన్య స్థావరములు. ఈ స్థావరములను సామాన్యుల సభ లేక దిగువ సభ అని పిలువవచ్చును. ఈ స్థావరముల యందలి ఇంద్రియ శక్తులు (వీటినే మనస్సు లేక ఇంద్రియ చైతన్యము అని కూడా అంటారు) ప్రధాన మంత్రి యగు బుద్ధికీ, దివ్యమైన విచక్షణా శక్తులకు విధేయులై వుంటారు. సామాన్య మానవుడు ప్రధానముగా మనస్సు యొక్క ప్రభావమునకు లోబడి యుండును. ఈ ప్రభావము పరమాత్మ నుండి విముఖమై వుండుట వలన అది సత్యమును మరుగు పరచును. మరియూ మానవ చైతన్యమును సృష్టి విషయములతో ముడి వేసి వుంచును. ఇంద్రియ చైతన్యము దిగువనున్న మూడు వెన్నెముక చక్రముల ద్వారా పని చేయును. కానీ, మనిషి జీవితము ఆత్మ యొక్క మార్గదర్శకత్వము నందు వుండిన యెడల మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక చక్రముల నుండి పనిచేయు ఇంద్రియములు అనాహత, విశుద్ధ, మెడుల్లా యందలి చైతన్యమునకు చెందిన విచక్షణా శక్తులకు విధేయులై యుండును.  అనగా ప్రాపంచిక వ్యక్తి మనస్సు యొక్క ప్రాబల్యమున్న మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార చక్ర స్థావర చైతన్యమున జీవించును. ఆధ్యాత్మిక జీవనము గడుపు వ్యక్తి ఎగువనున్న అనాహత విశుద్ధ మెడుల్లా చక్ర స్థావరముల యందలి విచక్షణ కలిగిన బుద్ధి ప్రాబల్యమున జీవించును.( బుద్ధి అనగా సత్యమును ఎరుక పరచు చైతన్యము.)


చిత్రపటము 1 (వివరణ)

ఆత్మ రాజుగా పరిపాలించునపుడు శరీర సామ్రాజ్యము వుండు విధము:

1. పెద్ద మెదడు, మెడుల్లా: రాజైన 'ఆత్మా యొక్క భవనము, ఇవి దివ్య చైతన్య స్థావరములు

2. మెడుల్లా, విశుద్ధ, అనాహత: పెద్దల సభ దివ్యమైన విచక్షణా శక్తుల నిలయము.

3. మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార: సామాన్యుల సభ, దిగువ సభ, చట్టమునకు లోబడి ప్రవర్తించు ఇంద్రియ శక్తుల స్థావరములు. (చట్టము అనగా పైన గల మూడు చక్రముల యందలి బుద్ధి, విచక్షణా శక్తి) 

 4. శరీర సామ్రాజ్య ప్రదేశములు: మూలాధారమందలి ప్రశాంతమైన పునరుత్పత్తి శక్తి మరియూ శరీరమందలి కండలు, ఎముకలు, మజ్జ ఇతర అవయవములు, నరములు, రక్తము, నాడులు, సిరలు, గ్రంధులు, చర్మము మొదలగునవి. 

 5. పది ఇంద్రియ యువరాజుల పాలిత ప్రాంతములు. అవి 5 జ్ఞానేంద్రియ శక్తులు మరియూ 5 కర్మేంద్రియ శక్తులు. అవి యువరాజ శక్తులతో కూడియున్నవి (కాళ్ళకు నడిచే శక్తి, కళ్ళకు చూపు, చెవులకు వినికిడి శక్తి మొదలైనవి).  

1. వినికిడి ప్రాంతము - "సత్యమును విను యువరాజు " చే పాలించబడును.
2. చూపు ప్రాంతము - "ఉన్నతమైన దృష్టి కలిగిన యువరాజు " చే పాలించబడును. 
3. నాసికా ప్రాంతము - "స్వచ్ఛమైన పరిమళపు యువరాజు " చే పాలింపబడును
4. జిహ్వకు చెందిన ప్రాంతము - "సరైన ఆహారమును భుజించు యువరాజు " చే పాలింపబడును
5. నోరు - కంఠస్వర ప్రాంతము; "దయ, సత్యవాక్కు యువరాజు " చే పాలింపబడును.
6. స్పర్శ ప్రాంతము - ప్రశాంత అనుభూతి యువరాజుచే పాలించబడును
7. చేతులు - నైపుణ్య ప్రాంతము - "నిర్మాణాత్మక పిడికిలి, పట్టు కలిగిన  యువరాజు "చే పాలించబడును
8. చలన ప్రాంతము - పాదాలు; "ధర్మ మార్గ నడత కలిగిన యువరాజు " చే పాలించబడును
9. పునరుత్పత్తి ప్రాంతము - "అదుపునందున్న సృష్టి కారక ప్రేరణ " యువరాజుచే పాలించబడును.  
 10. విసర్జన ప్రాంతము - "పరిశుభ్రత-స్వచ్ఛపరుచు యువరాజు " చే పాలించబడును. 

శరీర సామ్రాజ్యమందలి స్వేచ్ఛాయుత ప్రజలు బుద్ధి అను ప్రధాన మంత్రిచే నిర్దేశింపబడిన వారు - ఆలోచన (తెలివి), సంకల్ప శక్తి, అనుభూతి, కోట్లాది కణములు, అణువులు, పరమాణువులు, ఎలక్ట్రానులు, క్రియాశీల జీవన వెలుగు రేఖ సమూహములు అన్నియూ తెలివితో కూడి, ప్రాముఖ్యత కలిగి తృప్తి కలిగిన ప్రజలై వుందురు. శరీరము నందు సర్వశక్తులూ సామరస్యముతో, సమర్థతతో, సంపదతో, కలిసిమెలిసి శరీర సామ్రాజ్యమునందు అంతటా పని చేయుదురు.  


Monday, May 13, 2024

1.1 నైతిక మానసిక ఆధ్యాత్మిక యుద్ధములు

 



THE THREE BATTLES: MORAL, PSYCHOLOGICAL & SPIRITUAL


 భగవద్గీత యందు తెలుపబడిన కురుక్షేత్ర యుద్ధము శరీర క్షేత్రమందలి మూడు భాగముల యందలి యుద్ధమును గెలుచుటకు చేయవలసిన ప్రయత్నములను వివరించు చున్నది.

అవి నైతిక, మానసిక, ఆధ్యాత్మిక యుద్ధములు

1 ప్రాపంచికమైన/నైతిక యుద్ధము: మంచికీ చెడుకూ, సత్కర్మకూ దుష్కర్మకూ మధ్యన జరుగు కురుక్షేత్రమందలి మన శరీరమందలి శరీర ఇంద్రియ ప్రాంతమున జరుగు యుద్ధమే ప్రాపంచిక, నైతిక యుద్ధము.

2. మానసిక యుద్ధము: ధర్మక్షేత్ర, కురుక్షేత్రమందలి మెదడూ, వెన్నెముక ప్రాంతమున యోగా, ధ్యానము చేయు సమయమున మానసిక యుద్ధము జరుగును. ప్రాణశక్తి, చైతన్యమును మానసిక ప్రవృత్తులు, ఇష్టాయిష్టములు, బాహ్యమునకు సృష్టి విషయముల వైపు లాగగా బుద్ధి యొక్క శుద్ధమైన విచక్షణా శక్తులు ప్రాణశక్తి చైతన్యమును అంతరంగ ఆత్మవైపు లాగునపుడు ఈ మానసిక యుద్ధము జరుగును. 

3. ఆధ్యాత్మిక యుద్ధము: ధర్మక్షేత్రమందలి మెదడు స్థానౌన లోతైన ధ్యాన సమయమున ఆధ్యాత్మిక యుద్ధము జరుగును. అధమ స్థాయికి చెందిన శరీర స్పృహను సమాధియందు కరిగించి విశ్వచైతన్యము నందు ఆత్మ పరమాత్మతో జయప్రదముగా లయమగుటయే ఆధ్యాత్మిక యుద్ధము. 

పరిణతి చెందిన యోగి దివ్యానందకరమైన సమాధి స్థితిని సాధించి దానియందు దివ్యానందమును అనేకమార్లు అనుభవింపవచ్చును. కానీ అతను అటువంటి దివ్యానంద స్థితి యందు లయమై యుండుటను నిరంతరము ఎడతెగక కొన్సాగింప లేక పోతాడు. అతను అతని గతకర్మల ప్రభావము వలన మరియూ అతనియందు కోరికలూ బంధములూ మిగిలియుండుట వలన అతడు 'అహంభావమునూ, శరీర స్పృహనూ ' మరలా పొందును. అయిననూ యోగి 'పరమాత్మతో' జయప్రదముగా లయమగు ప్రతీ అనుభవము వలన అతని ఆత్మచైతన్యము మరింత బలపడి, అది శరీర సామ్రాజ్యముపై ధృఢమైన అదుపును సంపాదింపగలుగును. చివరకు అతని కర్మ ఫలము నిశ్శేషమగును. అధమస్థాయికి చెందిన అతని కోరికలు, బంధములూ అణచివేయబడును. అతని అహము నిర్జింపబడును. యోగి 'కైవల్యము ' అనబడు ముక్తి ని పొందును. అదియే భగవంతుని యందు శాశ్వతమైన ఐక్యత.  

 విముక్తిని పొందిన యోగి తన మూడు శరీరపు పొరలనూ విసర్జించి, శాశ్వతమైన నిత్య జాగరూకమైన, నిత్య నూతన ఆనందమైన సర్వ వ్యాపక పరబ్రహ్మ యందు స్వేచ్ఛగా వుండవచ్చును. లేక అతడు కోరుకొన్నచో అతను సమాధి స్థితిని వీడి శరీర స్పృహను పొంది శారీరిక కార్యకలాపములను చేయవచ్చును. అట్టి కార్య కలాపములను అతను "నిర్వికల్ప సమాధి స్థితి" యందు నిర్వహించును. అటువంటి ఉన్నత స్థితి యందు యోగి ఆత్మ చైతన్యమును బాహ్యమునకు వెలిబుచ్చును. అటువంటి స్థితి యందు యోగి దివ్య పరమాత్మ విశ్వ ప్రణాళిక యందు తన వంతు బాధ్యతలను బాహ్య ప్రపంచమున నిర్వహించుతూ, ఏ విధమైన కల్మషములను పొందక, తాను ఎటువంటి మార్పునూ చెందక భగవదవగాహనను వీడక, సుద్ధ ఆత్మ తత్వము నందే అతడు కొనసాగును. ఇటువంటి దివ్యమైన స్థితి యందు రాజైన 'ఆత్మా శరీర సామ్రాజ్యం పై  నిర్వివాదమైన అదుపును కలిగియుండును. 


*****************

Tuesday, April 2, 2024

1.1 ధర్మక్షేత్ర కురుక్షేత్ర మందలి విభాగములు

  



1.1 ధర్మక్షేత్ర కురుక్షేత్ర మందలి విభాగములు

 కర్మలను చేయు శరీర క్షేత్రము మరియు మనస్సు, ప్రకృతి యందలి మూడు సహజమైన ప్రభావపూరిత గుణములు, వాటి యందు వ్యక్తమగు రీతిని అనుసరించి మూడు విభాగములుగా విభజింపబడును. ఆ గుణములు 1. సత్త్వ, 2. రాజస, 3. తామసగుణములు. 

సత్వము అనబడు అనుకూల లక్షణము మనిషి యందు మంచి, సత్యము, స్వచ్చత మరియు ఆధ్యాత్మికతను ప్రభావితము చేయును. తామసమనబడు ప్రతికూల (నెగెటివ్) లక్షణము మనిషియందు చెడును, అసత్యమును, సోమరితనము, అజ్ఞానములను ప్రభావితము చేయును. 

రాజసము అనబడు తటస్థమైన (న్యూట్రల్) లక్షణము క్రియా శీలకమైన గుణము. ఇది సత్వముతో కలిసి, తమస్సును అణచుటకు, లేదా తమస్సుతో కలిసి సత్వమును అణచుటకు సహాయపడుచూ, శరీరమునందు నిత్యమూ క్రియాశీలతనూ, చలనమునూ కలుగజేయును.

 శరీర క్షేత్రమందలి మొదటి భాగము: శరీర ఉపరితల ప్రాంతము 

(First Portion of the Field: The Surface of the Body)

 పైన తెలిపిన 3 శరీర విభాగముల యందు మొదటి భాగము, శరీర ఉపరితలము. ఉపరితలమందలి పంచేంద్రియ అవయవములు (చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు) మరియు కర్మేంద్రియములు (మాటలను కల్పించు నోరు, చేతులు, కాళ్ళు, విసర్జన మరియు జననేంద్రియములు). మానవుని శరీర ఉపరితల భాగమునందు ఇంద్రియ సంబంధ, శరీర కదలికలకు చెందిన కార్యకలాపములు అనగా అనరముల వ్యవస్థచే ప్రేరేపితమైనవి నిత్యమూ జరుగుచుండును. అందుచేతనే శరీర ఉపరితల భాగమును దానికి తగిన విధముగా కురుక్షేత్రమని పిలువబడినది. అనగా బాహ్య ప్రపంచమునకు చెందిన కార్యకలాపములు అన్నియూ నెరవేర్చబడు క్షేత్రము. 

 ఈ శరీర ఉపరితల ప్రదేశము రాజస, తామస గుణములకు నివాస  ప్రదేశము. ప్రధానముగా రాజస గుణమునకు నివాస ప్రదేశము. తమస్సు - భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము యొక్క విశ్వక్రియాశీలక ధాతు తరంగములతో కలసి పనిచేయుట వలన పంచభూతలు అనగా ఘన, ద్రవ, తేజస్సు, వాయు, ఆకాశ సృష్టి పదార్థములుగా కంటికి కనపడు విధముగా ఏర్పడును. ఆ విధముగనే భౌతిక శరీరమునకు చెందిన స్థూలమైన అణుమాత్రపు సృష్టి పదార్థముగా ఏర్పడి, ఆపై మానవ శరీరము ఏర్పడును. తమస్సు యొక్క ప్రతికూల చీకటి తత్వము వలన సృష్టి పదార్థము యొక్క సూక్ష్మమైన మూల సారము (భగవత్తత్వము) స్థూల తత్వపు రూపు వలన మరుగున పడి మానవుని గ్రాహక శక్తియందు అజ్ఞానమును కలుగజేయును. క్రియాశీలక రాజసగుణము యొక్క ప్రాబల్యము  కురుక్షేత్రము (శరీరము) నందు, మనిషి యొక్క చపలత్వముతో కూడిన తత్వము నందు అతను అదుపు చేయదలచు - నిత్యమూ మార్పు చెందు ప్రపంచ తత్వము నందు విస్పష్టమగుచుండును. 

శరీర క్షేత్రమందలి  రెండవ భాగము: ప్రాణశక్తి, చైతన్యము  వసించు మెదడు వెన్నెముక యొక్క చక్ర స్థానములు

 కర్మలను చేయు శరీర క్షేత్రమునందలి రెండవ భాగము 1. ప్రాణశక్తి చైతన్యము వసించు మెదడు, వెన్నెముక మరియు దానికి చెందిన ఆరు సూక్ష్మ చక్ర స్థానాలు (స్థూల శరీర పరంగా మెడుల్లా, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాధిష్ఠాన, మూలాధార చక్రములు)

2. దానికి చెందిన  (మెదడు, వెన్నెముకలకు చెందిన) రెండు అయస్కాంత ధృవములైన మనస్సు, మరియు బుద్ధి.

మనస్సు స్థూల తత్వము వైపు ఆకర్షింపబడుట వలన చక్ర స్థానముల యందలి సూక్ష్మమైన శక్తులు బాహ్యమునకు వెలువడి, గొప్ప వెలుగుతో కూడిన గ్యాస్ లైట్ కాంతి రేఖలవలె విరజిమ్మబడును. ఆ క్రమమున అవి శరీరమందలి ఇంద్రియములకు చెందిన నరముల వ్యవస్థను క్రియాశీలము చేయును. బుద్ధి ఈ సూక్ష్మ శక్తులను లోనికి లాగినపుడు అవి మెదడు స్థానము నందు లోనకు గ్రహింపబడి ఆత్మ చైతన్యము నందు విలీనపరచబడును. అప్పుడు ఈ గ్యాస్ లైట్ బయటి వెలుగు తగ్గినట్లు అగును.  మెదాడూ, వెన్నెముక దండెము, దాని 6 చక్రస్థానములతో కలిపి ధర్మక్షేత్ర కురుక్షేత్రము అనిపిలువబడును. అనగా 1. సూక్ష్మశక్తుల మేధాతీతమైన శక్తుల ధర్మ క్షేత్రము మరియూ స్థూల రూప కార్యాచరణ  (పంచేంద్రియాలతో చేసే పనులు) కురుక్షేత్రము. 

 శరీరమునకు చెందిన ఈ ప్రాంతమునందు ప్రకృతికి చెందిన రాజస, సత్వ గుణములు మిక్కిలి ప్రాబల్యము కలిగి యుండును. రాజస గుణము పంచ భూతముల సూక్ష్మ మూల తరంగములతో కలిసి పని చేయుట వలన 5 కర్మేంద్రియాలకు శక్తి కలిగింపబడుతుంది. అవి పనిచేయు నైపుణ్యము (hands), చలనము (feet), వాక్కు (speech), పునరుత్పత్తి (procreation) మరియు విసర్జన (excretion). రాజసగుణము ఇంకనూ ప్రాణము యొక్క 5 ప్రత్యేక ప్రవాహాలను కల్పించును. 5ప్రత్యేక ప్రాణ ప్రవాహములు శరీరము ముఖ్యమైన పనులు చేయుట యందు తోడ్పడును. 

 "సత్వము" పంచభూతముల సూక్ష్మ తరంగము మూలకములతో కలియుటవలన సున్నితమైన  అవగాహనా శక్తుల అవయవ నిర్మాణము జరుగును. వీటి శక్తి వలన పంచేంద్రియ జ్ఞానము జాగృతమగును. గాఢముగా ధ్యానము చేయు యోగి యొక్క మెదడు, వెన్నెముక చక్రస్థానములందు అతడు అనుభవించు సృష్టి పదార్థము యొక్క నిజమైన సున్నితమైన సూక్ష్మ తత్వము, ప్రశాంతత, ఆత్మనిగ్రహము, ఇతర ఆధ్యాత్మిక శక్తులు (వీటి గురించి తరువాత వివరించబడును) - ఇవన్నియు ధర్మక్షేత్రము - కురుక్షేత్రము అయిన శరీరము పై సత్వగుణ ప్రభావము వలన కలుగును.    

 శరీర క్షేత్రమందలి మూడవ భాగము: దివ్య చైతన్యము యొక్క నిలయము-మెదడు 

శరీర క్షేత్రము యొక్క మూడవభాగము మెదడునందు కలదు. ఇది కనుబొమ్మల నుండి పది వేళ్ళ దూరములో  నడినెత్తి మీది గుండ్రటి వలయాకార స్థలము వరకు, అక్కడి నుండి మెడుల్లా వరకూ వ్యాపించి యుండును (నడినెత్తి మీది గుండ్రటి వలయాకార స్థలము శిశువు తలపై మెత్తటి గుండ్రటి ప్రదేశము - దీనినే "మాడు లేక బ్రహ్మరంధ్రము" అంటారు. శిశువు పెరిగిన కొలదీ ఈ ప్రదేసము గట్టి పడును). ఈ స్థానమును "ధర్మ క్షేత్రము" అంటారు.  

ధర్మక్షేత్రమందలి భాగములు 

1. మెడుల్లా, 

2. మెదడు ముందటి పై భాగము, 

3. ఆధ్యాత్మ నేత్రము యొక్క సూక్ష్మ స్థానము, 

4. వేయిదళ పద్మము - (వీటన్నిటితో పాటు), 

5. వీటన్నిటికీ చెందిన దివ్య చైతన్యము. 

ధర్మ అను పదమునకు సంస్కృత మూలము 'ధృ', అనగా పట్టి ఉంచునది లేక ఆధారముగా వుండునది అని భావము. ధర్మక్షేత్రమునకు ఆ భావము వర్తించునదై వున్నది. శరీరమందలి ధర్మక్షేత్ర ప్రదేశము మనిషి జీవమునకు ముఖ్య కారణము. ఆ విధముగా అది జీవమును మనిషి యందు పట్టివుంచును. ప్రాణశక్తి, చైతన్యము అతి సూక్ష్మ రూపమున ఇచ్చట వ్యక్త పరచబడి అవి మనిషి శరీరమును నిర్మించుటకు, అతనిని పోషించుటకుకారణమై యున్న శక్తులకు మూలమై వున్నది. అట్టి శక్తుల మూలముననే ఆత్మ చివరకు మూడు శరీరములను    ( స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు) వీడి పరమాత్మను చేరును. ఆ విధముగా ప్రకృతి యొక్క స్వచ్ఛమైన కాంతివంతమైన సత్వగుణము ధర్మక్షేత్ర ప్రాంతమున మిక్కిలి ప్రాబల్యము కలిగిన లక్షణము.  ధర్మక్షేత్రము ఆత్మ యొక్క నిలయము. ఆత్మ యొక్క శుద్ధమైన చైతన్యము తానొక ప్రత్యేకమైన ఉనికిని కలిగియుండి, ఈ స్థానము నుండియే స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను నిర్మించునదై మరియూ వాటిని పరిపాలించునదై యుండును. ఆత్మ తనను శరీర బాహ్యమునకు వ్యక్తపరచక (అనగా శరీర స్పృహగా మారకపోతే) తనయందే కేంద్రీకృతమై ఉన్నయెడల అది పరబ్రహ్మముతో ఏకమై యుండును. అట్టి స్థితి యందు అది ప్రకృతియొక్క క్రియాశీలక గుణములచే మరియూ ఇతర కార్యకలాపములచే స్పృశింపబడక, మూడు శరీరముల (స్థూల, సూక్ష్మ, కారణ శరీరముల) పరిమితులకు, వాటి సూక్ష్మమైన కారణములకు అతీతమైన వేయిదళ పద్మము నందు నిత్యనూతన ఆనందపు సింహాసనమున ఆసీనమై యుండును.        

ప్రాణశక్తిని (అనగా జీవమును) సృష్టించి, దానిని పోషించు సూక్ష్మ శక్తులు మరియూ తరంగశక్తులు  (ఓంకారము నుండి ఏర్పడే తరంగశక్తులు) ధర్మక్షేత్ర ప్రాంతమందలి మెదడునందు వేయిదళపద్మము మరియూ ఆధ్యాత్మిక నేత్రము యొక్క సూర్యుని నుండి ప్రవహించి మెదడూ, వెన్నెముకయందలి సూక్ష్మమైన, స్థూలమైన స్థావరముల యందు వ్యాపించి శరీరమును, దాని జ్ఞాన అవగాహనను, ఇతర కార్యకలాపములను సజీవము గావించును. మెదడూ, వెన్నెముక సూక్ష్మమైన, స్థూలమైన శక్తులను ప్రవహింపజేయునవియే గాక, అవి చైతన్య స్థావరములు అనికూడా పిలువబడును.  

 ధర్మక్షేత్రము నుండి 'ఆత్మ చైతన్యము ' ప్రాణశక్తి యొక్క అధోగమనమును అనుసరించును. *ఆత్మ యందలి ప్రకాశము (Sun of the Soul) తన చైతన్యమును విద్యుత్కాంతి రేఖలవలె ఆధ్యాత్మిక నేత్రము ద్వారా వెన్నెముక యందలి ఆరు చక్ర స్థావరములకు పంపించును. ఆత్మ యొక్క దివ్య చైతన్యము వెన్నెముక చక్ర స్థావరముల (షట్చక్రాలు) యందలి ప్రభావ పూరిత శక్తికి తానే మూలముగా తనను వ్యక్తపరచు చుండును. ఆత్మ చైతన్యము సూక్ష్మ శరీర చక్ర స్థావరముల నుండి తదుపరి, తనకు సన్నిహితము అయిన అవచేతనా స్థితిని (సూపర్ కాన్షస్నెస్) చేరి, అపై శరీర స్పృహను చేరి, అటునుండి స్థూల శరీరపు వెన్నెముకను చేరును. వెన్నెముకను చేరిన ఆత్మ చైతన్యము వెన్నెముక యందలి నాడీ వలయ కేంద్రముల ద్వారా నాడీ వ్యవస్థను చేరి, వాటి ద్వారా శరీర ఉపరితలమును చేరును. ఈ విధముగా మనిషి స్పృహను కలిగి యున్నపుడు అతని బాహ్య శరీరము ఇంద్రియముల నుండి అందించబడు ప్రేరణలకు స్పందించు చుండును. ఆ స్పందనకు కారణమైన ఆత్మ చైతన్యము ఆ స్థితి యందు తనను శరీరపు 'అహము ' గా వ్యక్తము చేయును. 

సన్ ఆఫ్ ది సోల్: సూర్యకాంతి వంటి ఆత్మ యందలి ప్రకాశము 

 

Monday, April 1, 2024

Soul Vs Ego యుద్ధం పుట్టుపూర్వోత్తరాలు


భగవంతుడిని పోలిన ఆత్మ (Soul) Vs శరీరమును పోలిన అహము (Ego) 

(భగవదంశ అయిన ఆత్మ Vs శరీరాంశమైన ఆత్మ)  


 ఒక సరళమైన విధానమున చెప్పవలెనన్న రాజైన ఆత్మ రాచభవనమునందు వసించు అంతరంగ ప్రదేశములు:-

1. అధిచేతన స్థితి యొక్క సూక్ష్మ స్థావరము (Superconsciousness)

2. కూటస్థ చైతన్యము (Christ Consciousness)

3. విశ్వచైతన్యము (Cosmic Consciousness)

 ఈ స్థావరములు వరుసగా 1. మెడుల్లా, 2. మెదడు ముందుభాగము- రెండు కనుబొమల నడుమ స్థానము (అదియే ఆధ్యాత్మ నేత్ర స్థానము), 3. మెదడు పైభాగము/నడినెత్తిన (ఆత్మ సిమ్హాసనము). అది వేయిదళ పద్మము యందలి స్థానము. ఈ స్థానములకు చెందిన స్థితి నుండి చైతన్యము ప్రవహించి, "ఆత్మ" రాజుగా ఉన్నతమైన పరిపాలనను సాగించును. అనగా మనిషి యందు ఆత్మ భగవంతుని ప్రతిబింబమై యుండును. కానీ ఆత్మ శరీర చైతన్యమునకు దిగి వచ్చినచో అది "మాయ, మరియు అజ్ఞానము" యొక్క ప్రభావమునకు గురగును. అనగా వ్యక్తి భ్రాంతికి, అజ్ఞానమునకు గురగును. ఫలితముగా అహము చైతన్యము (Ego) ఏర్పడును. 

" ఆత్మ" విశ్వమాయకు గురై భ్రాంతికి లోబడినపుడు అది పరిమితమైన "అహము" (Ego) గా మారును. అపుడది శరీరము తోను, శరీరమునకు చెందిన ఇతర విషయములతోను (ఇంద్రియాలతో) తనను పోల్చుకొనును. అహము (Ego) రూపమున ఉన్న ఆత్మ శరీరమునకు ఉన్న పరిమితులు అన్నిటిని తనకు ఆపాదించుకొనును. ఆ విధముగా శరీరముతో తనను పోల్చుకొనెడి ఆత్మ, తన సర్వవ్యాపక తత్వమును, సర్వజ్ఞతను, సర్వశక్తివంత తత్వమును వ్యక్తపరచ జాలదు. ధనికుడైన రాజకుమారుడు మతి మరపును పొంది తానొక బికారినని భావించి, మురికి వాడల యందు సంచరించు విధముగా ఆత్మ తాను పరిమితమైన దానిని అని భావించును. ఇటువంటి భ్రాంతిమయ స్థితి యందు, అహము (Ego) అను రాజు శరీర సామ్రాజ్యమును ఆక్రమించును. 

 భ్రాంతికి గురైన "అహము చైతన్యము" "నేను శరీరమును, ఇది నా కుటుంబము, ఇది నా పేరు, ఇవన్నీ నా సంపదలు" అని పలుకును. అహము తాను శరీర సామ్రాజ్యమును పరిపాలిచు చున్నాను అని  భావించిననూ, నిజమునకు అది శరీరము, మనస్సునకు చెందిన ఒక ఖైదీ. మరియూ మనస్సు, శరీరమూ రెండునూ సూక్ష్మమైన విశ్వప్రకృతికి  చెందిన మాయోపాయము నందలి "పావులు" మాత్రమే.

 సృష్టి యందలి బ్రహ్మాండ జగత్తు నందు దివ్య పరబ్రహ్మకు, మరియూ ప్రకృతొ యొక్క అసంపూర్ణ వ్యక్త రూపమునకు మధ్యన నిరంతరం ఒక నిశ్శబ్ద పోరాటమునకు మనమే సాక్షులము.  దివ్య పరబ్రహ్మ యొక్క నిష్కళంక తత్వము నిరంతమూ మోసపుచ్చు గుణమున్న, దయ్యపు స్వరూపమైన విశ్వవ్యాపిత భ్రాంతి శక్తి కల్పించు అసహ్యకరమైన వికృత స్వరూపములతో నిత్యమూ పోరాడుచుండును. ఒక శక్తి ఎరుకతో సర్వమూ శుభకరమైన "మంచి"ని వ్యక్త పరచుచుండును. మరొక శక్తి రహస్యముగ పనిచేయుచూ "చెడు"ను కల్పించుచుండును. 

బ్రహ్మాండ జగత్తున జరుగుచున్నదే సూక్ష్మ జగత్తున కూడా జరుగుచుండును. జ్ఞానమునకు మరియు అవిద్య/అజ్ఞానముగా రూపొందుచున్న ఒక నిశ్చితమైన భ్రాంతికర శక్తికి - మధ్యన జరుగు యుద్ధమునకు మానవ శరీరము మరియు మనస్సూ ఒక యథార్థమైన యుద్ధభూమి. "ఆత్మ" రాజు యొక్క సామ్రాజ్యమును తన యందు నెలకొల్పదలిచిన ప్రతి ఆధ్యాత్మిక అభిలాషీ "అహము" (Ego) అను రాజును, తిరుగుబాటుదారులను (మనస్సులోని చెడు శక్తులు), అహము యొక్క శక్తివంతులైన సహచరులను ఓడింపవలెను. ధర్మక్షేత్ర, కురుక్షేత్రమందు జరుగు యుద్ధమిదియే.


00000000

Thursday, March 28, 2024

1.1 ఆత్మ నివసించు ప్రదేశము

  

శరీర సామ్రాజ్య వ్యవస్థ - "ఆత్మ" నివసించు ప్రదేశము  

 మానవుని శారీరిక మానసిక నిర్మాణ వ్యవస్థ చక్కటి పరిపూర్ణతతో కూడియుండి అది భగవంతుని దివ్యమైన ఏర్పాటును (ప్రణాళికను) తనయందు కలిగియున్నది. మనిషి యందు భగవంతుని ప్రతిబింబము ఆత్మ రూపమున ఉన్నది.  పురుష వీర్యకణము - స్త్రీ అండము  రెండూ కలిసి ఒక జీవకణముగా ఏర్పడినప్పుడు, అదే సమయమున "ఆత్మ" సర్వ శక్తివంతమగు ప్రాణము మరియు  చైతన్యముగా ఒక వెలుగు రూపమున ఆ జీవకణము నందు ప్రవేశించును. శిశువు శరీర భాగములు పెరిగి వృద్ధి చెందుచుండగా, పైన తెలిపిన ప్రాణము మెడుల్లా యందు స్థితమై యుండును. మెడుల్లాను "ప్రాణశక్తి స్థావరము" అందురు. కావున మెడుల్లాను "ప్రాణశక్తికి మార్గము" అని చెప్పుదురు. ఎందుకనగా రాజైన ఆత్మ ఈ మార్గము ద్వారా జయప్రదముగా శరీర సామ్రాజ్యము నందు ప్రవేశించును. ప్రాణశక్తి స్థిత స్థావరమున (seat of Life)  "ఆత్మ" యొక్క సూక్ష్మమైన జ్ఞానము మొట్టమొదటి  సారిగా తనను వ్యక్తపరచుకొనును. అట్టి జ్ఞానము నందు ఆ జీవి యొక్క కర్మానుసారము అతనికి రాబోవు జీవితము యొక్క  వివిధ దశలు ముద్రితమై యుండును. "ప్రాణము" లేక "ప్రజ్ఞ కలిగిన క్రియాశీలక ప్రాణశక్తి" (Intelligent Creative Life Force) యొక్క అద్భుతశక్తి వలన మరియు "ఆత్మ" యొక్క దిశానిర్దేశము మేరకు వీర్యకణము అండముతో కలిసిన సంయుక్త  బీజము (zygote) దశను దాటి ఆపై పిండరూప దశలను దాటి మానవ శరీర రూపమును పొందును. 

 సూక్ష్మ తత్వము (astral), కారణ తత్వము (causal) - ఆత్మ యొక్క ఉపకరణములు లేదా సృజనాత్మక శక్తులు.   ఆత్మ మొట్టమొదట ప్రాణకణము నందు ప్రవేశించునపుడు అది రెండు సూక్ష్మమైన శరీరపు పొరలను ధరించి యుండును. అందు  మొదటి శరీరము కారణ రూపు కలిగిన  THOUGHTRONS (ప్రాణకణికలు) చే ఏర్పడినది. దీని చుట్టూ సూక్ష్మ రూపు కలిగిన LIFETRONS తో  కూడిన "సూక్ష్మశరీరము" ఏర్పడియుండును.  సూక్ష్మ, స్థూల శరీరములు ఏర్పడుటకు కారణమైనది కనుక అది "కారణశరీరము" అని పిలువబడినది. కారణశరీరము  35 ఆలోచనా శక్తులను కలిగియుండును. వీటినుండి 19 మూల తత్వములచే సూక్ష్మ శరీరము, మరియు 16 స్థూల రసాయన తత్వములచే స్థూల శరీరము ఏర్పడును. 


సూక్ష్మ శరీరపు 19 మూల తత్వములు: 1. బుద్ధి (intelligence), 2. అహంకారం (ego), 3. చిత్తము (feeling), 4. మనస్సు (mind), 5. చూచుట, వినుట, వినుట, రుచి, వాసన, స్పర్శ అనబడు అయిదు పంచేంద్రియ జ్ఞానములు 6. పునరుత్పత్తి, విసర్జన, మాట్లాడు, నడచు, శారీరిక పరిశ్రమ చేయగలుగు మానసిక శక్తులైనా ఐదు కర్మేంద్రియ జ్ఞానములు, 7. పంచ ప్రాణములు - ఐదు ప్రాణ ఉపకరణములు - అది 

1. Crystalizing power -  శరీర స్థిరత్వము, పెరుగుదల , 

2. Assimilation - అనగా జీర్ణక్రియ  

3. Elimination   అనగా విసర్జన

4. Metabolising - జీవప్రక్రియ అనగా జీర్ణమైన ఆహారమును శక్తి రూపమున ఇతర శరీర భాగాలకు సమానముగా పంచుట  

5. Circulation అనగా ప్రసరణ. ఇది భౌతిక శరీర కార్యకలాపాలకు చెందినది. 

 సూక్ష్మ శరీరము నందలి 19 తత్వములు స్థూల శరీరమును నిర్మించి,  పోషించి,  దానికి జీవమును కల్పించును. సూక్ష్మ శరీరమునకు చెందిన మెదడు (కాంతి తో కూడిన వేయిదళ పద్మము), మరియూ వెన్నెముక (సూక్ష్మ శరీరము యొక్క వెన్నెముకను సుషుమ్న అందురు) మరియూ వాటికి చెందిన ఆరు చక్ర స్థానముల నుండి ఈ 19 తత్వములు పనిచేయును. స్థూల శరీర పరముగా ఈ చక్రస్థానములు మెడుల్లా  యందు మరియు వెన్నెముక యందలి 5 స్థావరములైన 

1. గొంతుక వెనుకనున్న విశుద్ధ, 

2. హృదయమునకు ఎదురుగా వున్న అనాహత, 

3. నాభికి ఎదురుగా వున్న మణిపూర, 

4. జనేంద్రియములకు ఎదురుగా నున్న స్వాధిష్ఠాన, 

5. వెన్నెముక మూలమున వున్న మూలాధార గా వున్నవి. 

 మనస్సు యొక్క స్థూలమైన శక్తులు స్థూల శరీర భాగములపై వ్యక్తమగును. కానీ ఆత్మ యొక్క సూక్ష్మమైన శక్తులు అనగా మనో చైతన్యము, బుద్ధి, సంకల్పము, చిత్తము - ఇవి మెడుల్లా మరియూ మెదడు యొక్క సున్నితమైన కణజాలము నందు వుండి అచట నుండి వాటి ద్వారా (అనగా మెదడు, మెడుల్లా ద్వారా)  వ్యక్తమగును.



Monday, March 25, 2024

1.1 గీతా సారము

 1.1  ప్రతి రోజు రాత్రి ఆత్మ పరిశీలన చేసుకొనవలసిన ఆవశ్యకత 

 భగవద్గీత మొట్టమొదటి శ్లోకము నందే ప్రతి వ్యక్తీ ప్రతి రాత్రి ఆత్మపరిశీలన చేసుకోవలసిన అతి ముఖ్యమైన ఆవశ్యకతను ఎత్తి చూపుతున్నది. దాని మూలమున వ్యక్తి తనయందలి ఏవిధమైన శక్తి (మంచి లేక చెడు శక్తి) ఆ రోజు యుద్ధమున గెలిచినది అతనికి  స్పష్టముగా  అర్థమగును. భగవంతుని ప్రణాళికతో సామరస్య పూరితముగా జీవించదలచిన వ్యక్తి ప్రతి రాత్రి అన్ని కాలములకు ఉపయుక్తమగు ప్రశ్నతో తనను తాను ప్రశ్నించుకొనవలెను. ఆ ప్రశ్న: మంచి, చెడు కర్మలు చేయబడు శరీర ప్రాంతము నందు గుమికూడిన నా యందలి భిన్న ప్రవృతులు ఏమి చేసినవి? నిరంతరము సాగు ఈ పోరాటము నందు ఏ శక్తి ఈ రోజు గెలిచినది? కుటిలమైఅన ప్రలోభమును కల్పించు చెడు ప్రవృత్తులు మరియు వాటికి వ్యతిరేకమైన స్వీయ క్రమశిక్షణ మరియు బుద్ధి - నాకు ఇప్పుడు తెలియజేయవలసినది.

వారేమి చేసిరి?

 యోగి మనస్సును కేంద్రీకరించి ధ్యానము చేసిన పిదప తన ఆత్మ శోధనా శక్తిని ఈ విధముగా ప్రశ్నించెను: "మెదడు, వెన్నెముక యందలి చైతన్య స్థావరముల యందున్న ఆత్మ యొక్క సంతానమైన బుద్ధి, దాని ప్రవృత్తులు తమ రాజ్యమును తిరిగి పొందుటకై శరీరేంద్రియ కార్య కలాప క్షేత్రము నందున్న మానసిక ఇంద్రియ శక్తులు చైతన్యమును బాహ్యమునకు లాగు ప్రయత్నమున, ఈ రెండు శక్తులు యుద్ధము చేయుట యందు ఆసక్తిని కలిగి అవి ఏమి చేసినవి? ఈ రోజు ఎవరు గెలిచిరి?

 సాధారణ మానవుడు  యుద్ధము  నందు   తగిలిన గాయపు చిహ్నములను కలిగియుండి మిక్కిలి వేధింపబడిన యోధుని వలె, ఆ యుద్ధములను చేయు విధములను అన్నిటినీ తెలిసియుండును. ఆ యుద్ధభూమిని అర్థము చేసుకొనుట యందు శత్రుసైన్యము  యొక్క దాడి వెనుకనున్న శాస్త్రీయతను అర్థము చేసుకొనుట యందు అతనికి గల శిక్షణ కొరవడినదై యుండును. అతను ఆ యుద్ధమును చేయగలుగు జ్ఞానమును సంపూర్ణముగా కలిగి యుండిన యెడల అతని విజయావకాశములు మరింత మెరుగుపడి అతనికి దిగ్భ్రమను కలిగించు ఓటములు తగ్గిపోవును.

కురుక్షేత్ర యుద్ధమునకు గల కారణములను చారిత్రాత్మకముగా పరిశీలించిన యెడల పాండుపుత్రులు తమ రాజ్యమును ధర్మయుతముగా పరిపాలించు సమయమున, ధృతరాష్ట్ర మహారాజు పుత్రుడైన , దుష్టుడైన దుర్యోధనుడు మాయోపాయముచే పాండవుల రాజ్యమును అపహరించి, వారిని దేశబహిష్కరణ గావించెనని తెలియుచున్నది.  

 సూచనాత్మకముగా, శరీరమను రాజ్యము "ఆత్మ" అను రాజునకు మరియు అతని సంతానమైన సద్గుణ ప్రవృత్తులకు న్యాయ సమ్మతముగా చెందినది. కానీ అహము మరియు దుష్టులైన, నీచులైన అతని సంతాన ప్రవృత్తి మోసపూరితముగా ఆత్మ యొక్క రాజ్యమును కాజేసిరి. "ఆత్మ" అను రాజు తన సామ్రాజ్యమును తిరిగి పొందుటకు ప్రయత్నించునపుడు శరీరము, మనస్సు యుద్ధభూమిగా మారును. "ఆత్మ" యను రాజు శరీర సామ్రాజ్యమును పరిపాలించు విధానము, అతడు దానిని కోల్పోయి మరలా దానిని గెలుచుకొను విధానమును తెలుపునదే "గీతా సారము".      

 

Saturday, March 23, 2024

1.1 జీవన సంగ్రామము: విపులమైన వ్యాఖ్యానము

 

PAGE 7

EXPANDED COMMENTARY: THE BATTLE OF LIFE

 జీవన సంగ్రామము: విపులమైన వ్యాఖ్యానము 

ఒక వ్యక్తి తన తల్లి గర్భము నందు జీవము పొందినది మొదలు, అతడు చివరి శ్వాస ను విడచునంత వరకు అతను తన ప్రతి జన్మ యందు అనేక విధములైన సంఘర్షణలను - జీవ సంబంధమైనవి, వంశపారంపర్యమైనవి, సూక్ష్మ క్రిమి సంబంధమైనవి, సాంఘిక పరమైనవి, నైతిక పరమైనవి, రాజకీయ పరమైనవి, సామాజిక ప్రమైనవి, మానసిక పరమైనవి, అధిభౌతికమైనవి - అనేక విధములైన బాహ్య పరమైన, అంతర్గతమైన సంఘర్షణలను ఎదుర్కొనును. ప్రతి సంఘర్షణ యందు మంచి - చెడు శక్తులు తమ విజయమునకై పోరాడుచుండును. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా మానవుడు ఈ పోరాటము నందు తన ప్రయత్నములు అన్నిటినీ ధర్మముతో అనుసంధానమగు విధముగ యత్నించవలెను. అంతిమమైన లక్ష్యము ఏమనగా ఆత్మ సాక్షాత్కారము - ప్రతి మనిషి యందున్న ఆత్మను అతను కనుగొనుటయే! ఆత్మ భగవంతుని ప్రతిబింబము మరియు శాశ్వతమైన, నిత్య జాగరూకమైన, నిత్య నూతన ఆనందమైన పరబ్రహ్మతో ఏకత్వము కలిగినది. 

 ప్రతిజన్మ యందు ఆత్మ మొట్ట మొదటగా, పునర్జన్మను పొందగోరు ఇతర ఆత్మల నుండి పోటీని ఎదుర్కొనును. ఒక నూతన మానవ దేహము ఏర్పడు ప్రక్రియ యందు పురుషుని వీర్యకణము, స్త్రీ అండము - రెండును కలసినపుడు, జన్మ జన్మకు నడుమ ఆత్మలు నివసించునట్టి దివ్య లోకమునందు మెరుపు వంటి ఒక్క వెలుగు మెరియును. ఆ వెలుగు,  ఒక ఆత్మ - అది మునుపటి జన్మల యందు తాను సముపార్జించుకొనిన కర్మలకు అనుగుణమగు ఒక పద్ధతి క్రమమును ప్రసరింప జేయగా, దానికి అనుగుణమైన ఆత్మ ఆ వెలుగునకు ఆకర్షింపబడును. అది గత జన్మల యందు తానుగ చేసుకొనిన కర్మల ప్రభావము. ప్రతి జన్మ యందు "కర్మ" యనునది పాక్షికముగ దానికి అనుగుణముగ వంశ పారంపర్య శక్తులతో తానుగ సమకూడును. ఒక శిశువు యొక్క ఆత్మ ఆ ప్రకారముగ తన పూర్వ జన్మపు కర్మలకు అనుగుణమైన వంశపారంపర్య కుటుంబమునకు ఆకర్షింపబడును. తల్లి గర్భము నందు జీవము నింపుకొనిన ఆ ఒక్క కణము నందు ప్రవేశించుటకు  అనేక ఆత్మలు పోటీ పడును. వాటి యందు ఒక్క ఆత్మ మాత్రమే విజయము పొందును (తల్లి ఒకరి కన్న ఎక్కువ మందిని గర్భమున ధరించినపుడు, ప్రాథమిక కణములు కూడ గర్భమున ఒకటి కన్న ఎక్కువ యుండును) . 

 తల్లి గర్భమున ఎదుగుచున్న శిశువు వ్యాధులతో, చీకటితో పోరాడుచు, పరిమితమునకు బంధింపబడి యుండును. అప్పుడప్పుడూ తన దివ్యత్వమును గుర్తుకు తెచ్చుకొనుచుండును. ఎదుగుచున్న శిశువు నందలి ఆత్మ, తాను ప్రస్తుతము నివసించుచున్న శరీరము యొక్క ఎదుగుదల, తన గత జన్మల కర్మలను, మంచి చెడుల ప్రభావమును అనుసరించి యుండుటను గమనించి దానితో సంతృప్తి చెంది యుండును. దీనికి అదనముగ అది  బాహ్య ప్రపంచము నుండి తనకెదురగు ప్రభావమును ఎదుర్కొనుచుండును. ఆ ప్రభావములు తన పరిసరముల వలన, తల్లి చేయు కర్మల వలన, బాహ్యమైన శబ్దములు, తల్లి యొక్క భావనల వలన, తల్లి అనుభవించు ప్రేమ, ద్వేషపు తరంగముల వలన, తల్లి యొక్క ప్రశాంతత మరియు కోపముల వలన ఏర్పడుచుండును.   శిశువు జన్మను పొందిన పిదప అది సహజముగ తన సుఖమును కోరి, జీవించి యుండవలెనను సహజమైన స్వభావమును కలిగియుండి, దానికి వ్యతిరేకముగ తన పూర్తి ఎదుగుదల లేని శరీరముతో పెనుగులాడు చుండును.

 ఎదుగుచున్న బాలుడు తనకు ఎరుక గలిగిన స్పృహతో దిశానిర్దేశము లేని ఆట పాటల కోరికలతో సమయము గడుపుచూ ఆపై విద్యను అభ్యసించి విద్యకు చెందిన ఒక క్రమబద్ధమైన శిక్షణను పొంది జీవితమున పెనుగులాడును. క్రమముగా జీవితమున ఇతనికి మరిన్ని తీవ్రమైన సంఘర్షణలు ఎదురగును. అవి అతని కర్మ ప్రవృత్తి ప్రభావమున అతని లోని స్వభావము నుండి లేక, బాహ్యమైన పరిసర ప్రభావము వలన మరియూ చెడు సహవాసము వలన ఏర్పడు సంఘర్షణలు. 

 యవ్వనము నందు వ్యక్తి తను ఎదురుచూడనటు వంటి అనేక సమస్యలను అకస్మాత్తుగా ఎదుర్కొన వలసి వచ్చినదని గ్రహించును -- అవి లైంగిక వాంచలు, ధనమును సులువుగా అధర్మ మార్గమున సంపాదించుట, తన సహచరులనుండీ ఎదురగు వత్తిడి, సమాజము యొక్క ప్రభావము మొదలగునవి. యవ్వనమున అడుగిడిన వారు తమను దండెత్తుచున్న ప్రాపంచిక సమస్యల సైన్యమును ఎదుర్కొనుటకు తమ చెంత "జ్ఞానము" అను ఖడ్గము లేదని గ్రహింతురు. 

వయోజనులు (adults) తమ యందు సహజముగా వున్న జ్ఞానమునూ, ఆధ్యాత్మిక విచక్షణను అభివృద్ధి పరచుకొనుటను తెలియక దానిని ఉపయోగించుట తెలియక తమ శరీర సామ్రాజ్యము మిక్కిలి కృరముగా అదుపు చేయలేని విధముగా కష్టములను కలిగించు చెడు కోరికల యొక్క, విధ్వంసకర అలవాట్ల యొక్క, వైఫల్యముల యొక్క, అజ్ఞానము యొక్క, కోరికల యొక్క విషాదము యొక్క తిరుగుబాతుదారులచే ఆక్రమింపబడినదని తెలిసికొందురు. 

 కొంతమంది వ్యక్తులు మాత్రము తమ శరీర సామ్రాజ్యము నందు ఒక నిరంతర సంగ్రామము జరుగుచున్నదని గ్రహించి యుందురు. కానీ, సాధారణముగా పూర్తి విధ్వంసము సంభవించిన పిదపనే వ్యక్తులు తమ జీవితములు నాశనము గావింపబడినవని గ్రహింతురు. మనిషి విజయము వైపు ముందుకు సాగుటకు ఆరోగ్యమునకు, శ్రేయస్సునకు, ఆత్మ నిగ్రహమునకు మరియూ జ్ఞానమునకు దినదినమూ నూతనముగా ప్రారంభించి ఆత్మ సామ్రాజ్య ప్రాంతమును ఆక్రమించిన తిరుగుబాటుదారులైన అజ్ఞానము నుండి ఒక్కొక్క అంగుళముగా చేజిక్కించుకొనవలెను. ప్రతి రోజూ కొంచెము కొంచెముగా మంచి వైపు పయనించాలి. 

 జాగరూకుడగు యోగి, సాధారణ మానవులు ఎదుర్కొను బాహ్యమైన యుద్ధముతో పాటూ, తన అంతరంగము నందు మరొక యుద్ధమును ఎదుర్కొనును. అది ఒక వైపు ప్రతికూలశక్తులైన చంచలత్వమునకు ( మనస్సు వలన కలుగునవి - ) మరియూ మరొకవైపు ధ్యానము చేయవలెను అను అనుకూలమైన ప్రయత్నము/కోరికకు మధ్యన జరుగు యుద్ధము. యోగి ఆత్మ యొక్క అంతరంగ ఆధ్యాత్మిక సామ్రాజ్యము నందు తానుగా తిరిగి స్థిర పడుటకు ప్రయత్నించు సందర్భమున జరుగును. ఆత్మ యొక్క అంతరంగ ఆధ్యాత్మిక సామ్రాజ్యము ఏదనగా - వెన్నూ, వెన్నెముక, మెదడూ నందలి ప్రాణశక్తి, దివ్యచైతన్యమునకు చెందిన సూక్ష్మ చక్ర స్థానములు. 


000000000000




1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...