Friday, March 22, 2024

1.1 కురుక్షేత్రము, సంజయుని ప్రతీకాత్మకత

  


ఈ కలహమాడు శక్తుల  (mind and wisdom -   మనస్సు మరియు బుద్ధీ ) యొక్క యుద్ధ భూమియే కురుక్షేత్రము. "కురు" అను పదము యొక్క సంస్కృత ధాతువు "క్రి" నుండి ఏర్పడినది. దాని భావము పని లేక భౌతిక కర్మ, "క్షేత్ర" అనగా భూమి. భౌతిక, మానసిక, ఆత్మ శక్తులతో కలిసి యున్న ఈ శరీరమే కర్మలను చేయు క్షేత్రము. వ్యక్తి జీవితమున సంభవించు కర్మలన్నియూ శరీరము అనబడు ఆ క్షేత్రముననే జరుగును. భగవద్గీత యందలి ఈ శ్లోకమున ఈ శరీరము "ధర్మక్షేత్రము"  అని పిలువబడినది. (ధర్మము అనునది సద్గుణము మరియు పవిత్రమైనద్, అందుచేతనే పవిత్ర క్షేత్రముగా చెప్పబడినది). ఏలయనగా ఆత్మకు చెందిన విచక్షణతో కూడిన తెలివికి ( అనగా పాండుపుత్రులకు) మరియు గుడ్డి మనసు యొక్క నీచమైన, అదుపులేని కార్య కలాపములకు (అనగా కౌరవులు - అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు) ఈ క్షేత్రము నందే ధర్మ సంగ్రామము జరుగనున్నది. 

 PAGE 6

సంజయుని సూచనాత్మకత/ప్రతీకాత్మకత: 

నిష్పక్షపాతమైన అతీంద్రియ అంతఃపరిశీలన

"సంజయ" శబ్దార్థము "సంపూర్ణముగ జయించిన; తనను తాను జయించిన వాడు". స్వార్థ పూరిత బుద్ధి లేనివాడు మాత్రమే నిష్పక్షపాతముతో తనకు తాను పరిశీలించుకొను శక్తి సామర్థ్యమును కలిగి యుండును. ఆ విధముగ భగవద్గీత యందు సంజయుడు ఒక "దివ్యమైన అంతర్దృష్టి" యనబడు వాడు. సాధనాపేక్ష గల సాధకునికి సంజయుడు "నిష్పక్షపాత అతీంద్రియ స్వయం పరిశీలన" "వివేకవంతమైన ఆత్మ పరిశీలన". అది తనను తాను వ్యక్తిగతముగా వేరు వ్యక్తి యని భావించి పక్షపాతరహితముగా పరిశీలించుకొను శక్తి, మరియు ఖచ్చితముగ విమర్శించుకొను సమర్థత.  వ్యక్తికి తనకు తెలియకనే తన యందు ఆలోచనలు కలుగుచుండును. ఆత్మ పరిశీలన యనగా అంతర్ దృష్టి శక్తిచే మనస్సు తన ఆలోచనలను తానే పరిశీలించుకొను శక్తి.    అది బుద్ధిని ఉపయోగించి తర్కింపక, తానుగా అనుభూతి చెంది తెలిసికొనుట - అది భావోద్వేగపు పక్షపాతముతో కాదు. సుస్పష్టమైన ప్రశాంతమైన అంతర్ దృష్టి తో తెలిసికొనుట.  

 మహా భారతము నందు భగవద్గీత ఒక అంతర్భాగ అంశము. వేదవ్యాసుడు సంజయునికి యుద్ధ భూమి యందు జరుగు సర్వము సుదూరము నుండి చూడగలుగు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించెను. ఆ శక్తి వలన సంజయుడు అంధుడైన ధృతరాష్ట్ర మహారాజునకు యుద్ధమున జరుగు విషయములను వివరింపగలిగెను. సంజయుని అట్టి వివరణ యందలి భాగముగ వేదవ్యాసుడు భగవద్గీతను మహాభారతమున ఒక అంశముగ లిఖించెను. కావున భగవద్గీత యందలి మొదటి శ్లోకమున ధృతరాష్ట్రుని ప్రశ్న వర్తమాన కాలమునకు చెందియుండవలెనని ఎవ్వరైననూ భావింతురు. అచ్చట వ్యాసుడు ఉద్దేశ్యపూర్వకముగా "ఏమి చేసిరి" అను క్రియను భూతకాలమునకు చెందినదిగా లిఖించెను.   

 వివేకవంతుడైన విద్యార్థికి ఇది ఒక స్పష్టమైన సూచన. ఆ సూచన ఏదనగా - భగవద్గీత ఉత్తర భారత దేశము నందలి కురుక్షేత్రమున జరిగిన చారిత్రాత్మక యుద్ధమును సందర్భవశముగా ప్రస్తావించు చున్నది. వ్యాసుడు ప్రధానముగ మానవుని దైనందిన జీవితమున జరుగు ఒక సర్వ సామాన్యమైన యుద్ధము యొక్క గతిని లిఖించ దలచినచో, అతను ధృతరాష్ట్రుని తో సంజయుని ఉద్దేశించి వర్తమాన కాల క్రియను ఉపయోగించి " నా పుత్రులు మరియూ పాండు పుత్రులు - వారిపుడు ఏమి చేయుచున్నారు?" అని ప్రశ్నింప జేసి యుండును.  

 ఇది మిక్కిలి ముఖ్యమైన అంశము. భగవద్గీత యందలి కాలమునకు అతీతమైన సందేశము ఒక చారిత్రాత్మకమైన యుద్ధమునకు మాత్రమే సంబంధించినది కాదు. అది విశ్వము నందు మంచికి - చెడుకు మధ్య జరుగు సంఘర్షణను సూచించునది. అంతియే గాక అది పరమాత్మకు - ప్రకృతికి, ఆత్మకు - శరీరమునకు, జీవితమునకు - మరణమునకు, ఆరోగ్యమునకు - అనారోగ్యమునకు, విజ్ఞానమునకు - అజ్ఞానమునకు, శాశ్వతత్వమునకు - అశాశ్వతత్వమునకు, ఆత్మ నిగ్రహమునకు - ప్రలోభమునకు, బుద్ధికీ - గ్రుడ్డిదైన ఇంద్రియ మనస్సుకు మధ్యన జీవితమున నిరంతరము జరుగు సంఘర్షణను సూచించును. మొదటి శ్లోకము నందు "ఏమి చేసిరి" అని ధృతరాష్ట్రుడు అడుగుట యందు భూతకాల క్రియను వ్యాసుడు ఉపయోగించి, ఒక వ్యక్తి తన మనస్సు నందు ఆ రోజు జరిగిన  సంఘర్షణలను ఆత్మ పరిశీలనా శక్తి ని ఉపయోగించి పునస్సమీక్షించుకొని, ఆ రోజు అనుకూలమైన ఫలితములు సంభవించెనా లేక ప్రతికూల ఫలితములు సంభవించెనా యను వానిని నిర్ణయించుకొనుటను వ్యక్తపరచు చున్నవి. 


000000000

sanjaya, dhritarashtra, mind, wisdom

Tuesday, March 19, 2024

1.1 మొదటి శ్లోకము వ్యాఖ్య - రెండు వ్యతిరేక శక్తులు

 

రెండు వ్యతిరేక శక్తులు:

అధమ స్థాయికి చెందిన మనస్సు యొక్క ప్రవృత్తులు Vs ఆత్మ యొక్క విచక్షణా శక్తి - బుద్ధి

ఈ క్షేత్రమునందు పోరాడు రెండు వ్యతిరేక శక్తులు, లేక రెండు అయస్కాంత ధృవములు ఏవనగా 1. విచక్షణతో కూడిన తెలివి (బుద్ధి) మరియు 2. ఇంద్రియాసక్తి కలిగిన మనస్సు.                 "బుద్ధి" అను శుద్ధమైన విచక్షణా శక్తి కి దృష్టాంతముగా "పాండు రాజు" సూచింపబడెను. అతడు కుంతీదేవి భర్త. కుంతీదేవి అర్జునుని మరియు ఇతర సోదర పాండవుల తల్లి. "పాండవులు" నివృత్తి ధర్మ సూత్రములు అనబడు ప్రాపంచిక విషయముల పరిత్యాగమును అనుసరించువారు. "పాండు" నామము "పండా" అను శబ్దము నుండి వెలువడినది. దీని అర్థము "తెలుపు". ఇది శుద్ధమైన బుద్ధి యొక్క స్పష్టతకు దృష్టాంతము. "మనస్సు"కు దృష్టాంతముగా గ్రుడ్డి "ధృతరాష్ట్ర" మహారాజు సూచింపబడెను. అతడు నూరుగురు కౌరవుల తండ్రి. కౌరవులు అనగా శరీరము నందలి ఇంద్రియ భావ ప్రవృత్తులు - ప్రాపంచిక ఆనంద ప్రవృత్తిని కలిగిన వారు.

                "బుద్ధి" తన వివేచనను ఆత్మ కు చెందిన "అధిచేతన" (super consciousness) నుండి గ్రహించును. "ఆత్మ" కారణ శరీరమునకు చెందిన సూక్ష్మ మైన ఆధ్యాత్మిక మెదడు, వెన్నెముక స్థావరముల యందు గల చైతన్యము నందు స్థితమై యుండును. ఇంద్రియములతో కూడిన మనస్సు ఒక సూక్ష్మమైన అయస్కాంత ధృవము వంటిది. ఇది భౌతిక ప్రపంచము వైపు బహిర్ముఖమై యుండును. ఇది భౌతిక శరీరపు మెదడునందు "పాన్స్ వరోలి" (Pons Varoli) అను ప్రాంతము నందుండి ఎల్లపుడూ శరీరమందలి ఇంద్రియములను సమన్వయ పరచు చుండును. ఆ విధముగా నున్న బుద్ధి, చైతన్యమును సత్యమైన దానివైపు అనగా "ఆత్మ సాక్షాత్కారము" వైపు లాగుచుండును. ఇంద్రియములతో కూడిన మనస్సు చైతన్యమును సత్యము నుండి మరల్చి, దానిని శరీరమునకు చెందిన బాహ్యమైన ఇంద్రియ కార్యకలాపముల వైపు లాగుచుండును. ఆ విధముగా మనస్సు భ్రాంతి మయ ప్రాపంచిక ద్వంద్వములగు మాయకు చెందినదై యుండును.

"ధృతరాష్ట్ర" అను నామము "ధృత" అను మూలము నుండి వెలువడింది. దీని భావము - పట్టి ఉంచిన, ఆధారపడిన, గట్టిగా లాగి ఉంచు". "రాష్ట్ర" అనగా "రాజ్యము, రాజ అనగా పాలించు" అని భావము. దృష్టాంత పరముగా దీని భావము - ధృతం రాష్ట్రం ఏన - అనగా ఇంద్రియ రాజ్యమును ధృఢముగా పట్టుకుని రాజ్యమేలువాడు అని అర్థము. రథమునకున్న గుర్రములను కళ్ళెములు ఒకటిగా జతపరచి ఉంచు విధముగా "మనస్సు" ఇంద్రియాలను సమన్వయ పరుస్తుంది. శరీరము - రథము, ఆత్మ - ఆ రథము యొక్క యజమాని; తెలివి - సరథి; ఇంద్రియములు గుర్రములు. మైండ్/మనస్సు గుడ్డిదని చెప్పబడింది. కళ్ళెములు గుర్రముల నుండి ప్రేరణను రథ సారథి కి, రథ సారథి యొక్క మార్గదర్శకత్వమును గుర్రములకు అందజేయును. అదే విధముగా గ్రుడ్డి మనస్సు తానుగా జూచి గ్రహింపజాలదు. మరియు తానుగా సూచనలను ఇవ్వ జాలదు. కానీ అది ఇంద్రియముల నుండి భావములను గ్రహించి "తెలివి" ఇచ్చిన తీర్పునూ, సూచనలనూ ఇంద్రియములకు అందించును. తెలివిని "బుద్ధి" అనగా శుద్ధమైన విచక్షణా శక్తి నిర్దేశించినచో ఇంద్రియాలు అదుపులో వుంటాయి. తెలివిని ప్రాపంచిక కోరికలు నిర్దేశించినచో ఇంద్రియములు విశృంఖలతతో అదుపు తప్పును.




GOD TALKS WITH ARJUNA మొదటి శ్లోకము వ్యాఖ్య 1



  మొదటి శ్లోకము - 1వ విభాగము

"వారు ఏమి చేసిరి?" - మానసిక, ఆధ్యాత్మిక రణరంగ పరిశీలన 

  1వ శ్లోకము 

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |

మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ|| 

ధృతరాష్ట్రుడు ఈ విధముగా పలికెను

"పవిత్రమైన కురుక్షేత్ర రంగమందు (ధర్మక్షేత్రము-కురుక్షేత్రము) నా పుత్రులూ మరియూ పాండు పుత్రులు ఒక చోట చేరి, యుద్ధ కాంక్ష గలవారై, వారేమి చేసిరి, ఓ సంజయా?"

గురూజి  చే ఇవ్వబడిన పద అర్థము: అంధుడైన ధృతరాష్ట్ర మహా రాజు (అనగా గుడ్డి మనస్సు) నిజాయితీ పరుడైన సంజయుడిని (నిష్పక్షపాతము, అంతఃకరణ పరిశీలన) ఈ విధముగా ప్రశ్నించెను: "నా పుత్రులైన కౌరవులు (దుర్మార్గపు ఉద్రేకపూరితమైన మానసిక ఇంద్రియ ప్రవృత్తులు,  ధర్మపరులైన పాండవ పుత్రులు      ( శుద్ధమైన  బుద్ధి, విచక్షణా శక్తి గుణములు ) కురుక్షేత్రమందలి (కర్మలను చేయు శరీర క్షేత్రము) ధర్మక్షేత్రము నందు (పవిత్ర క్షేత్రమునందు ) - అంతరంగము, తన ఆధిపత్యమును నిలుపుకొనుటకై, యుద్ధమును చేయు కాంక్ష కలవారై అచటకు చేరగా అచట ఏమి జరిగినది?


ధృతరాష్టృని ప్రశ్న యందలి దృష్టాంత ప్రాముఖ్యత 

 ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతో సంజయుడిని కురుపాండవుల మధ్యన యుద్ధము, కురుక్షేత్రము నందు ఏవిధముగా జరిగినది అను దానిని పక్షపాత రహితముగా తెలుపమని అడుగగా- దృష్టాంత పరముగా ఒక ఆధ్యాత్మిక సాధకుడు తాను ఆత్మ సాక్షాత్కారమును గెలుచుటకై ధర్మ బద్ధమైన యుద్ధమునకు చెందిన తన దినచర్యలను ప్రతి దినమూ పునః పరీక్షించుకుని తనను తాను ప్రశ్నించుకొనుటను సూచించు చున్నది.


నిజాయితీ  తో కూడిన ఆత్మ పరిశీలన ద్వారా సాధకుడు తన కార్యకలాపములను విశ్లేషించుకొని, తన యందలి ఒకదానినొకటి ఎదిరించు మంచి-చెడు గుణముల యొక్క బలమును నిర్థారించుకొనును. అనగా అంచనా వేయును; ఆత్మనిగ్రహమును ఎదిరించు ఇంద్రియ లోలత్వము; విచక్షణతో కూడిన తెలివిని వ్యతిరేకించు మానసిక ఇంద్రియ ప్రవృత్తులు; ధ్యానము నందలి ఆధ్యాత్మిక ధృఢ సంకల్పమును ఎదిరించు మానసిక ఇంద్రియ ప్రవృత్తులు, శారీరిక చంచలత్వము; దివ్యమైన ఆత్మ చైతన్యమునకు ప్రతికూలముగా అజ్ఞానము మరియు అయస్కాంత శక్తి వలె ఆకర్షించు అధమ స్థాయికి చెందిన అహము యొక్క ప్రవృత్తి - మున్నగు కలహమాడు శక్తుల యొక్క యుద్ధ భూమియే కురుక్షేత్రము.


("కురు" అను పదము యొక్క సంస్కృత ధాతువు "క్రి" నుండి ఏర్పడినది. దాని భావము పని లేక భౌతిక కర్మ, మరియు క్షేత్ర అనగా భూమి). భౌతిక మానసిక ఆత్మ శక్తులతో కలిసి యున్న ఈ శరమే కర్మలను చేయు క్షేత్రము. వ్యక్తి జీవితమున సంభవించు కర్మలన్నియు శరీరము అనబడు ఆక్షేత్రముననే జరుగును. భగవద్గీతయందలి ఈ శ్లోకమున ఈ శరీరమును ధర్మ క్షేత్రము అని పిలువ బడినది. (ధర్మము అనునది సద్గుణము మరియు పవిత్రమైనది. అందుచేతనే పవిత్ర క్షేత్రం గా చెప్పబడినది)

ఏలయనగా ఆత్మకు చెందిన విచక్షణతో కూడిన తెలివికి (అనగా పాండు పుత్రులకు) మరియు గుడ్డి మనసు యొక్క నీచమైన, అదుపులేని కార్యకలాపములకు (అనగా కౌరవులు - అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు) మధ్యన ఈ క్షేత్రమునందే ధర్మ సంగ్రామము జరుగనున్నది. 


మరొక భావార్థము తో ధర్మ క్షేత్రము నిష్ఠతో కూడిన ఆధ్యాత్మిక విధులను మరియు ఆ విధమైన కార్యకలాపములను చేయు ప్రాంతమును సూచించును. (అనగా ధ్యానము నందు యోగి యొక్క కార్యకలాపములు). దానికి విరుద్ధముగా "కురుక్షేత్రము" - అనగా ప్రాపంచిక బాధ్యతలను సూచించును. ఆ విధముగా లోతైన దృష్టాంత భావమును పరికించిన యెడల "ధర్మక్షేత్రము-కురుక్షేత్రము" ఆత్మ సాక్షాత్కారమును సాధించుటకు యోగ-ధ్యానమునకు చెందిన ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగు శరీరమందలి అంతః క్షేత్రమును సూచించును. ఆ అంతఃక్షేత్రమేదనగా దివ్య చైతన్యమును కలిగియున్న మెదడూ, వెన్నెముక యందలి ఏడు సూక్ష్మ చక్రస్థావరములు.





*****************************




 


GOD TALKS WITH ARJUNA

  

మొదటి అధ్యాయము

అర్జున విషాద యోగము

అధ్యాయము యొక్క ప్రాముఖ్యత

ప్రఖ్యాతి చెందిన భగవద్గీత యోగశాస్త్రమునకు చెందిన ఒక సర్వోత్కృష్టమైన ప్రమాణ గ్రంధము. అది మానవుడి విశాల దృక్పథ అన్వేషణను ఒక ఆచరణీయత్మక విధానము తోను, నిగూఢ తత్వము తోను బోధించుచున్నది. మానవ జాతి తరతరాలుగా ఈ ప్రియమైన భగవద్గీత అందించిన ఉపదేశముల యందు స్వాంతనను, ఆశ్రయమునూ పొందినది. భగవద్గీత సాధకుడు ఆచరణీయాత్మకముగా అనుసరింపవలసిన ఆధ్యాత్మిక సూత్రములను తెలుపుటయే గాక, అవి ఒక పరిపూర్ణ యోగి సాధించిన జ్ఞానమును వ్యక్తపరచు పరిపూర్ణ సూత్రములు అని కూడా తెలియుచున్నది. 

 ఆధునిక గ్రంధముల ఉపోద్ఘాతమందు, ఆ గ్రంధమందలి విషయముల యొక్క సంగ్రహ ప్రస్తావన గావింపబడును. కానీ భారతదేశపు ప్రాచీన కాల హైందవ గ్రంధ రచయితలు గ్రంధము నందలి మొదటి అధ్యాయము నందు వారి లక్ష్యమును వ్యక్త పరచెదరు. ఆ విధముగా భగవద్గీత యందలి మొదటి అధ్యాయము గ్రంధము నందు తరువాత ప్రస్తావించబడు పవిత్ర సంభాషణకు పరిచయ వాక్యముల వలె ఉండును. ఈ మొదటి అధ్యాయము రంగమును సిద్ధము చేసి దానికి తగిన నేపథ్యమును ఏర్పాటు చేయగా, అందలి విషయములకు ప్రాముఖ్యత లేదు అను ఒక తేలిక భావముతో ఈ గ్రంధమును అధ్యయనము చేయరాదు. ఈ గ్రంధమును అధ్యయనము చేయునపుడు దాని రచయిత సుప్రసిద్ధుడైన వ్యాస మహర్షి ఈ గ్రంధము నందు కల్పించిన అన్య విషయ సూచనను గుర్తించి చదువవలెను. అది యోగ శాస్త్రమునకు చెందిన ప్రాథమిక సూత్రములను తెలియ చేయును 

 మరియూ అది భగవంతునితో ఐక్యతను అనగా ముక్తి లేక కైవల్యమును సాధించు మార్గమును అనుసరించు యోగి తన సాధన ప్రారంభమున ఎదుర్కొను కష్టములను వివరించును. యోగ సాధన లక్ష్యము భగవంతునిలో ఐక్యత పొందుట. మొదటి అధ్యాయమునందు అంతర్నిహితము గావింపబడిన సత్యములను అర్థము చేసికొనుట అనగా : యోగ ప్రయాణము కొరకు చక్కగా ఏర్పాటు చేసిన వ్యవస్థ యందు పయనించుటయే. పూజ్యులైన నా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు సాక్షాత్ జ్ఞానావతారము. వారు మొదటి అధ్యయము నందలి కొన్ని ప్రముఖమైన శ్లోకముల యందు నిగూఢమై యున్న అర్థమును వెలికి తీయుటను నాకు నేర్పించిరి. వారు అప్పుడు ఈ విధముగా పలికిరి - "నీ వద్ద తాళము చెవి కలదు. నీ యందలి అంతరంగ ప్రశాంతతతో నీవు ఈ గ్రంథమందలి ఏ శ్లోకమునైననూ అవగాహన చేసుకొని, దాని విషయమునూ సారమునూ తెలుసుకొనగలవు." వారిచ్చిన ప్రోత్సాహముతో మరియూ వారి కృపతో నేను ఈ గ్రంథమును సమర్పించు చున్నాను. 




************************


Wednesday, December 6, 2023

GIVE ME THE HUMBLEST PLACE WITHIN THY HEART

 నీ హృదయంలో నాకు అత్యంత వినయపూర్వకమైన స్థానం ఇవ్వుము


ఓ సర్వ సృష్టికర్త!

నీ కలల తోటలో నన్ను ప్రకాశవంతమైన పువ్వుగా ఉండనివ్వు. లేదా నీ స్వర్గపు విశాలమైన హారంలో నీ ప్రేమ యనెడి  కాలాతీతమైన దారపు పోగులో మెరిసే పూస వలె నేనొక చిన్ని నక్షత్రం అవుతాను. 

లేదా నాకు అత్యున్నత గౌరవం ఇవ్వు: నీ హృదయంలో అత్యంత నిరాడంబరమైన ప్రదేశం.అక్కడ నేను జీవితం యొక్క గొప్ప దర్శనాల సృష్టిని చూస్తాను. 




ఓ కలల కలనేతల ప్రభువా, శాశ్వత వేకువ అనెడి నీ ఆలయాన్ని చేరేందుకు నీ ప్రేమికులందరూ నడిచి వెళ్ళేందుకు ఆత్మ సాక్షాత్కారమనెడి  అతి మెత్తని తివాచీని నేయడం నాకు  నేర్పుము.


నీ సహజావబోధనలూ మరియూ వారి అంతర్దృష్టీ అనెడి పుష్పగుచ్చాలను నీ ఆరాధనా పీఠం పై అర్పించే నీ ఆరాధకులైన దేవదూతలను నేను చేరెదను గాక. 


by Paramahamsa Yogananda




 .



Tuesday, December 5, 2023

THE MELODY OF HUMAN BROTHERHOOD

 మానవ సౌభ్రాతృత్వ మధుర గీతిక




ఓ దివ్య చైతన్యమా! నీ కాంతి ధామాన్ని చేరుకోవడానికి అనేక దారుల గుండా ప్రయాణిస్తున్నాము. అన్ని మతముల నమ్మకాలు ఆఖరుగా చేరుకునే ఆత్మ సాక్షాత్కారమనే రాచబాట అందుకునే విధంగా మాకు మార్గ నిర్దేశనం చెయ్యి. 


అనేకంగా చీలిన మతాలన్నీ సత్యమనే మహా వృక్షానికి చెందిన చీలిపోయిన కొమ్మలే. అన్ని దేశ కాలాలకు చెందిన గ్రంధాలనే వనాలలో వ్రేలాడుతున్న్న ఆత్మసాక్షాత్కారమనే మధురఫలములను  చవిచూసెదము గాక. అత్యున్నత స్థాయి ఆరాధనను ప్రకటించే లెక్కలేనన్ని వ్యక్తీకరణలను ఏక కంఠముతో జపించుట మాకు నేర్పించు. 


ఓ జగన్మాతా! విశ్వప్రేమ అనెడి నీ ఒడిలోనికి తీసుకొని మమ్ము లాలించు. నీ మౌన వ్రతాన్ని విడనాడి మాకోసం విశ్వ మానవ సౌభ్రాతృత్వమనే మధుర గీతికని ఆలపించు. 

 

పరమహంస యోగానంద  


Whispers from Eternity


అందరితోటి నా ఆనందాన్ని పంచుకోవాలనీ మానవత్వపు ఆలయంలో నా నిరాడంబర గీతికలను సమర్పిస్తున్నాను. ఈ భక్తిప్రవాహాలలొని ఆత్మ చాల మందివ్యక్తులలో వాడిన స్ఫూర్తి పుష్పాలై వికసింపజేయును గాక.


పుస్తకం పేరు Whispers from Eternity  అని పేరు పెట్టడం లో నా ఉద్దేశ్యం, జగన్మాత యొక్క అంశములో భగవంతుడు అని. భగవంతుని అతీతమైన అంశంలో, సంపూర్ణమైన,  దైవము మానవ మేధకు అందడు;





1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...